మార్కెట్లకు ‘ఫెడ్‌’ దన్ను

ABN , First Publish Date - 2021-07-30T05:53:16+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. గురువారం బీఎ్‌సఈ

మార్కెట్లకు ‘ఫెడ్‌’ దన్ను

  • 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ 
  • సెన్సెక్స్‌  209 పాయింట్లు అప్‌ 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. గురువారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 209.36 పాయింట్ల లాభంతో 52,653.07 వద్ద ముగిసింది. ఎన్‌ఎ స్‌ఈ నిఫ్టీ 69.05 పాయింట్లు బలపడి 15,778.45 వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతోపాటు భవిష్యత్‌ ద్రవ్య పరపతి విధానంపై సానుకూల వైఖరిని కనబర్చడం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మెరుగుపర్చింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ట్రేడర్లు లోహ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. రూపాయి బలోపేతం, కొన్ని దిగ్గజ షేర్లలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడటం కూడా సూచీలు లాభాల బాట పట్టేందుకు దోహదపడ్డాయి. 


సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో సగం లాభాల్లో పయనించగా.. మరో సగం నష్టాలు చవిచూశాయి. 6.87 శాతం ఎగబాకిన టాటా స్టీల్‌.. సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 4.48ు, ఎస్‌బీఐ 3.83ు లాభపడ్డాయి. 


మారుతీ సుజుకీ షేరు 2.21 శాతం క్షీణించింది. పవర్‌గ్రిడ్‌ 2.13 శాతం పతనమైంది. బజాజ్‌ ఆటో, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీ స్‌,హెచ్‌యూఎల్‌ షేర్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. 


Updated Date - 2021-07-30T05:53:16+05:30 IST