ఫెడరర్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-05-19T08:17:52+05:30 IST

రెండేళ్ల విరామం తర్వాత క్లేకోర్టు బరిలోకిదిగిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన జెనీవా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్లో టాప్‌సీడ్‌ ఫెడరర్‌...

ఫెడరర్‌కు షాక్‌

జెనీవా: రెండేళ్ల విరామం తర్వాత క్లేకోర్టు బరిలోకిదిగిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన జెనీవా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ రెండోరౌండ్లో టాప్‌సీడ్‌ ఫెడరర్‌ 4-6, 6-4, 4-6తో పాబ్లో అండుజార్‌ (స్పెయిన్‌) చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి రౌండ్‌లో బై లభించడంతో నేరుగా రెండోరౌండ్‌ ఆడిన ఫెడరర్‌.. 2020 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత అతను పోటీపడ్డ రెండో టోర్నీ ఇది. 


Updated Date - 2021-05-19T08:17:52+05:30 IST