Advertisement
Advertisement
Abn logo
Advertisement

పద్య నాటకానికి గుర్తింపు తెచ్చిన ‘షణ్ముఖి’

తణుకు, డిసెంబరు 1: పద్య నాటకానికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు షణ్ముఖి ఆంజ నేయరాజు అని వక్తలు నివాళు లర్పించారు. బుధవారం తణు కు సురాజ్య భవనంలో ఆంజ నేయరాజు 93వ జయంత్యుత్స వాన్ని ఆంజనేయ కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు.  జబర్దస్త్‌ ఫేం అప్పారావు మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో కళాకారుల జీవనం భారంగా మారిందని, కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ఆదరించ వలసిన బాధ్యత ప్రతివారిపై ఉందని అన్నారు.  అనంతరం పద్మశ్రీ యడ్ల గోపాలరావును ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కె.ఆనంద్‌ ఘనంగా సత్కరించారు.  ఆంజనేయరాజు కళాపీఠం అధ్యక్షుడు రసరాజు,  రాష్ట్ర నాటక పరిషత్‌ సమా ఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, విద్యుత్‌ శాఖ డీఈ శ్రీధర్‌, విజయ షణ్ముఖి, దుర్గాప్రసాద్‌, షణ్ముఖి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement