Abn logo
Sep 26 2021 @ 08:24AM

ఎడ్లబండిపై నామినేషన్‌కు మహిళా అభ్యర్థి... ఈ వింతను చూసేందుకు వచ్చిన జనానికి దిమ్మతిరిగే రహస్యం చెప్పిన భర్త!

పట్నా: మన దేశంలో ఎన్నికలు పండుగలను తలదన్నేరీతిలో జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో అనేక వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటాయి. ఇటువంటి విచిత్ర ఘటన బీహార్‌లోని సహర్సా సమాహర్ణాలయ్‌లో కనిపించింది. ఈ వింతను చూసేందుకు జనం గుమిగూడారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన ఒక మహిళా అభ్యర్థి తన భర్తతోపాటు ఎడ్లబండిపై ఊరేగుతూ, బ్యాండ్ మేళం మధ్య కార్యాలయానికి వచ్చారు. అక్కడున్నవారంతా వీరిని ఆసక్తికరంగా గమనించారు. ఈ సందర్భంగా ఆ మహిళా అభ్యర్థి భర్త మాట్లాడుతూ ‘పెట్రోలు రేట్లు భారమయ్యాయి. అందుకే వాహనంలో పెట్రోలు నింపి, నామినేషన్‌కు రావాలంటే చాలా కష్టమైన పని. ధరల పెరుగులను వ్యతిరేకిస్తూ, ఎడ్లబండిపై వచ్చాం. ఇది రైతుల సంప్రదాయ వాహనం. అందుకే దీనిలో వచ్చాం.. అని అన్నారు. 

వివరాల్లోకి వెళితే సత్తార్కటై పరిధిలోని పశ్చిమ జిల్లా పరిషత్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన జిల్లా పరిషత్ మహిళా అభ్యర్థి రంజన్ దేవి తన భర్త కామ్రేడ్ విక్కీ రామ్‌తో పాటు ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చారు. ఈ సందర్భంగా మహిళా అభ్యర్థి భర్త, సీపీఐ నేత విక్కీరామ్ మాట్లాడుతూ ‘ఇటీవలి కాలంలో దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యుని పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. పేదల పరిస్థితి దుర్భరంగా మారిపోయిందన్నారు. కాగా ఎడ్లబండిపై నామినేషన్ వేసేందుకు వచ్చిన వీరిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...