నుదుటిపై రాతలు రాసిన మహిళా ఎస్ఐపై చర్య

ABN , First Publish Date - 2020-03-29T20:42:19+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో వలస కార్మికుల అగచాట్లుపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఓ వలస కార్మికుడి విషయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ ..

నుదుటిపై రాతలు రాసిన మహిళా ఎస్ఐపై చర్య

ఛత్తర్‌పూర్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో వలస కార్మికుల అగచాట్లుపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న సమయంలో ఓ వలస కార్మికుడి విషయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆమెపై చర్యకు ఉపక్రమించారు.


లాక్‌డౌన్ సమయంలో బయట తిరుగుతున్న వలస కార్మికుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా ఎస్పీ అతడి నుదుటిపై స్కెచ్‌పెన్‌తో కొన్ని రాతలు రాశారు. 'నేను లాక్‌డౌన్‌ను ఉల్లంఘించాను. నాకు దూరంగా ఉండండి' అంటూ ఆమె రాసిన రాతలు ఆ తర్వాత వీడియో రూపంలో వెలుగులోకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో వరుస విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఛత్తర్‌పూర్ ఎస్పీ కుమార్ సౌరభ్ వివరణ ఇస్తూ, వీడియో నిజమా కాదా అనేది పరిశీలించి, ఆ పనికి పాల్పడిందని 2016 బ్యాచ్‌ ఎస్ఐగా నిర్ధారణకు వచ్చామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులకు వైద్య పరీక్షల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యమైన చర్య కాదని, చట్టప్రకారం ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2020-03-29T20:42:19+05:30 IST