Abn logo
Sep 22 2021 @ 11:24AM

ఆఫీసులో అమ్మాయిని లవ్, హనీ, స్వీటీ అని పిలిస్తే...

మాంచెస్టర్: మీలో ఎవరైనా మీ ఆఫీసులో పనిచేసే తోటి మహిళా ఉద్యోగిని ముద్దు పేరుతో పిలుస్తున్నారా? అయితే వెంటనే అటువంటి అలవాటను మానుకోండి. లేదంటే మీ ఉద్యోగం ఊడిపోతుంది. ఇటీవల ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. అక్కడి ఒక కార్యాలయంలో పనిచేస్తున్న ఒక పురుష ఉద్యోగి తన తోటి మహిళా ఉద్యోగినులను లవ్, హనీ, స్వీటీ అనే పేర్లతో పిలిచి కోర్టులో దోషిగా తేలాడు. 

కోర్టు తన తీర్పులో... ఆఫీసులోని మహిళా ఉద్యోగినులను లవ్ అని పిలిస్తే అది వారిని అవమానపరిచినట్లని, అలాగే స్వీటీ, బెబ్స్ అని పిలవడం కూడా వారిని ఎగతాళి చేసినట్లే అవుతుందని పేర్కొంది. మహిళలను ఈ విధంగా పిలవడం తప్పు అని కూడా తెలిపింది. ఈ విధంగా ప్రవర్తించిన ఫ్యూనరల్ హోమ్ మేనేజర్‌ మైక్ హర్ట్లేను ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించాలనే నిర్ణయం సమర్థనీయమేనని పేర్కొంది. కేవలం మహిళలనే కాదు పురుషులను కూడా ముద్దు పేర్లతో పిలవడం కూడా తప్పేనని పేర్కొంది. అయితే మైక్ హర్ట్లేను కంపెనీలో ఉద్యోగం నుంచి తొలగించవద్దని, అతని తప్పును మన్నించి, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...