Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళ అవయవదానం

చేవెళ్ల: బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ అవయవ దానంతో మరికొందరికి ప్రాణాలకు ఊపిరిపోసింది. మండలంలోని ముడిమ్యాల్‌ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి(55)గత రెండు రోజుల క్రితం పొలం నుంచి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స చేయించగా ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే తన తల్లి శరీర భాగాలను దానం చేయడం ద్వారా మరికొందరికి ప్రాణాలు కాపాడే అవకాశముందని వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యుల అంగీకారంతో ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఎల్‌వీ.ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించారు. లక్ష్మి రెండు నేత్రాలు, కిడ్నీలు, లివర్‌ను ఆసుపత్రి వైద్యులు సేకరించారు. అనంతరం లక్ష్మి భౌతిక కాయాన్ని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేసి పువ్వులు చల్లి నివాళులర్పించారు. మృతురాలి కుటుంబసభ్యులను అభినందించారు. కాగా, మూడిమ్యాల్‌లో సాయంత్రం  లక్ష్మి అంత్యక్రియలు పూర్తిచేశారు. 

Advertisement
Advertisement