Viral: అందరూ చూస్తుండగా.. 80 ఏళ్ల వృద్ధుడిని చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో ఇది..!

ABN , First Publish Date - 2021-12-28T22:35:25+05:30 IST

కరోనా సంక్షోభం పుణ్యమా అని ప్రపంచం ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయింది! ఈ రెండు బ్యాచ్‌లకు చెందిన వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. వ్యక్తి స్వేచ్ఛకు పెద్ద పీట వేసే పాశ్చాత్య దేశాల్లో ఈ తగవులు ఒక్కోసారి అనూహ్య మలుపులు తిరుగుతంటాయి. కానీ ఇప్పటివరకూ జరిగిన వాటన్నిటినీ తలదన్నే ఘటన ఒకటి ఇటీవలే జరిగింది. విమానంలో ఉండగా ఓ వృద్ధుడు మాస్కు పెట్టుకోకపోవడంతో రెచ్చి పోయిన తోటి ప్రయాణికురాలు బీభత్సం సృష్టించింది.

Viral: అందరూ చూస్తుండగా.. 80 ఏళ్ల వృద్ధుడిని చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో ఇది..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా సంక్షోభం పుణ్యమా అని ప్రపంచం ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయింది!  ‘‘మాస్కు పెట్టుకుంటేనే కరోనా నుంచి తప్పించుకుంటాం.. బతికిబట్టకడతాం’’ అని ఓ వర్గం భావిస్తే.. ‘‘ఛస్.. అదంతా ట్రాష్.. ఓ విష ప్రచారం.. అసలు మాస్కు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు’’ అని వాదించేవారిది మరో వర్గం. ఈ క్రమంలో ఈ రెండు బ్యాచ్‌ల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. వ్యక్తి స్వేచ్ఛకు పెద్ద పీట వేసే పాశ్చాత్య దేశాల్లో ఈ తగవులు ఒక్కోసారి అనూహ్య మలుపులు తిరుగుతుంటాయి.


కానీ ఇప్పటివరకూ జరిగిన వాటన్నిటినీ తలదన్నే ఘటన ఒకటి ఇటీవలే జరిగింది. విమానంలో ఉండగా ఓ వృద్ధుడు(వయసు 80 ఏళ్లు) మాస్కు పెట్టుకోకపోవడంతో రెచ్చిపోయిన తోటి ప్రయాణికురాలు బీభత్సం సృష్టించింది. పండు ముదుసలి అని కూడా చూడకుండా ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పెద్దాయనపై ముందూ వెనుకా ఆలోచించకుండా  చేయి చేసుకున్న ఆ యువతి పేరు పాట్రీషియా కార్న్‌వాల్. అయితే.. అట్లాంటాలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ ఎయిర్‌పోర్టులో విమానం దిగగానే ఎఫ్‌బీఐ అధికారులు ఆమెను అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. 


పెద్దాయనపై యువతి దాడి చేస్తుండగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వాస్తవానికి గొడవ జరుగుతున్నప్పుడు  ఆ యువతి కూడా మాస్కు పెట్టుకోలేదు. ఇక.. పెద్దాయన మాస్కు తీసేసి ఆహారం తింటుండగా వివాదం రాజుకుందని కొందరు చెబుతున్నారు. ఏమాటకామాట చెప్పుకోవాలంటే.. యువతి చేయి చేసుకోవడానికి ముందు ఆ పెద్దాయన ప్యాట్రీషియాను ‘కేరెన్’ అని పిలిచారట. అమెరికాలో మహిళలను కేరెన్ అని పిలవడం చాలా పెద్ద తప్పు. పొగరుబోతు మహిళలు, తమ మాటే నెగ్గాలనే మొండి పట్టుదలగల వారిని  వెటకారంగా కేరెన్ అని పిలుస్తారట. వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం..  ఆ పెద్దాయన ప్యాట్రీషియాను కేరెన్ అని పిలూస్తూ.. ‘ఇక చాలు.. కూర్చో..’ అంటూ గట్టిగా గదమాయించాడు. అంతే.. నన్నే అంతమాట అంటావా.. అంటూ రెచ్చిపోయిన యువతి ఆయన చెంప ఛెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 



Updated Date - 2021-12-28T22:35:25+05:30 IST