Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్.. నవంబర్ 28న పెళ్లి నిశ్చయం.. ఇంతలోనే ఈ లేడీ ఇన్‌స్పెక్టర్ జీవితం ఇలా టర్న్ తీసుకుందేంటి..?

మహిళలు పైగా పోలీసులు అంటే మన సమాజంలో అందరూ గౌరవ భావంతో చూస్తారు. కానీ ఒక మహిళ అయి ఉండి తన చేసే పోలీసు వృత్తికి చెడ్డపేరు తీసుకొచ్చింది ఒక కాబోయే పెళ్లికూతురు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..


రాజస్థాన్‌లోని బర్లూట్ నగరంలోని ఒక పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న సీమ జాఖర్‌కు మరి కొద్ది రోజుల్లో వివాహం జరగబోతోంది. అలాంటి సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. 


సీమ అవినీతిపరురాలని, లంచం తీసుకొని నేరస్తులకు సహాయపడోతోందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణకు ఉన్నతాధికారులు ఆదేశమిచ్చారు. విచారణ జరిపిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 


పోలీసుల కథనం ప్రకారం.. కొద్ది రోజుల క్రితం పోలీసులకు భారీ మొత్తంలో గంజాయి రవాణా అవుతోందని సమాచారం అందింది. రవాణా చేసే స్మగర్లను పట్టుకోమని ఇన్‌స్పెక్టర్ సీమకు అధికారులు ఆదేశమిచ్చారు. ఆ స్మగ్లర్లను సీమ ఎలాగోలా పట్టుకుంది. కానీ పట్టుకున్నాక వారితో ఒక డీల్ కుదుర్చుకుంది. తాను అడిగిన డబ్బిస్తే వెంటనే వారిని విడిచిపెడతానని చెప్పింది. అందుకు ఆ స్మగ్లర్లు సీమకు రూ. 10 లక్షలు లంచం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. 


ఆ తరువాత ఇన్‌స్పెక్టర్ సీమ ఆ నేరస్తులను తన ప్రభుత్వ వాహనంలో అక్కడి నుంచి తప్పించి.. ఒక హోటల్‌లోని గదిలో పెట్టింది. వారు చెప్పిన రూ.10 లక్షలు ఒక గ్రామ సర్పంచ్ ద్వారా తెప్పించి ఆమెకు ఆ హోటల్‌లో ఇచ్చారు. ఇదంతా ఆ హోటల్ సీసీటీవి వీడియోలో రికార్డ్ అయింది. సీమ నేరం విచారణలో రుజువు కావడంతో ఆమెకు సహకరించిన ముగ్గురు కానిస్టేబుళ్లను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement