వేధింపులు తాళలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-24T17:51:32+05:30 IST

వంగూరు మండలంలో రంగాపూర్ గ్రామ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

వేధింపులు తాళలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలంలో రంగాపూర్ గ్రామ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దళిత మహిళా సర్పంచ్ అయిన ఝాన్సీరాణి నిద్రమాత్రలు మింగడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అధికారపార్టీ నాయకులు, అధికారుల వేధింపులు తాళలేక సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేయడంతో గ్రామంలో కలకలం రేగింది.


గ్రామ కంఠం భూ వివాదంలో పోరాడిన వ్యక్తులను జైలుకు పంపారన్న మనస్తాపంతో సర్పంచ్ ఝాన్సీరాణి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అధికారపార్టీ నేతలకు అధికారులు వత్తాసుపలుకుతున్నారంటూ ఆమె లేఖ రాసి నిద్రమాత్రలు తీసుకుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటిన కల్వకుర్తిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-09-24T17:51:32+05:30 IST