మహిళా ఓటర్లే అధికం

ABN , First Publish Date - 2021-01-18T05:38:18+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2021 సంవత్సరం ఓటర్ల తుది జాబితాను జిల్లా అధికారులు ప్రకటించారు.

మహిళా ఓటర్లే అధికం

  - జిల్లా ఓటర్లు 4,38,302 మంది  

-  పురుషులు 2,13,693,

-  మహిళలు 2,24,606

- 2556 ఓటర్ల తొలగింపు

- ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో జాబితా 

- 2021 ఓటర్ల తుది జాబితా వెల్లడి 

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2021 సంవత్సరం ఓటర్ల తుది జాబితాను జిల్లా అధికారులు ప్రకటించారు.  సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 4,38,302 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,13,693, మహిళలు 2,24,606 మంది ఉన్నారు. ఈ సారి కూడా మహిళా ఓటర్లే అధికంగా నమోదయ్యారు. పురుషుల కంటే 10,913 మంది ఎక్కువగా ఉన్నారు. 2020 సంవత్సరంలో విడుదల చేసిన జాబితాలో మహిళా ఓటర్లు 11,189 మంది ఉన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో వేములవాడ నియోజకవర్గంలో 2,08,196 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,00,672, మహిళలు 1,07,522 మంది ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,30,106 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,13,021, మహిళలు 1,17,084 మంది ఉన్నారు. 2020 ఓటరు జాబితా ప్రకారం 4,36,908 మంది ఓటర్లు ఉండగా ఈ సంవత్సరం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 1394 మంది ఓటర్లు పెరగడంతో 4,38,302కు చేరుకుంది. డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ 4,37,190 ఓటరు జాబితాను వెల్లడించగా ఇందులో 3,668 మందిని చేర్చుకోగా 2556 మందిని తొలగించారు.  4,38,302 మంది ఓటర్లతో తుది జాబితా విడుదల చేశారు. ఓటరు జాబితాను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యంతరాలను  వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే వీలును కల్పించింది. 

Updated Date - 2021-01-18T05:38:18+05:30 IST