Abn logo
Oct 17 2021 @ 23:34PM

ఎరువు.... బరువు

 దాళ్వాలో రైతులపై రూ.20 కోట్ల అదనపు భారం

 డీఏపీ బస్తా రూ.1,200 నుంచి రూ.1,700కు పెరుగుదల

 ఎకరానికి రూ.1,400 వరకు పెరగనున్న ఎరువుల భారం


డీజిల్‌ ధరలతో పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు భారంగా మారుతున్నాయి. ఏటికేడాది పెట్టుబడులు పెరుగు తున్నాయి కానీ గిట్టుబాటు ధర మాత్రం అందడం లేదు. దీనికితోడు కూలి ధరలు, డీజిల్‌ సాగుపై ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన ఎరువుల ధరలతో దాళ్వా పంటలో పెట్టుబడి భారీగా పెరగనుంది. ఇలా అయితే సాగు ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.


భీమవరం రూరల్‌, అక్టోబరు 17 : ఎరువుల ధరలు భారంగా మారనున్నాయి. ఈసారి దాళ్వా సాగులో ఎరువుల ధరల పెరుగుదలతో  సుమారు రూ.20 కోట్లు పెట్టుబడి పెరగనుంది. ఇప్పటికే పెట్టుబడి అధికమవు తున్న రైతులకు ఎరువుల ధర మరో గండంగా మారనుంది. ఎకరానికి అదనంగా రూ.1,400పైనే పెట్టుబడి పెరుగుతుం దని రైతులు అంటున్నారు. మరోపక్క డీజిల్‌ ధర సాగుపై ప్రభావం చూపుతోంది. గతేడాది దాళ్వాలో ఎకరానికి దమ్ము చేసేందుకు రూ.2400 తీసుకున్న ట్రాక్టర్‌ యజమానులు ఇప్పుడు రూ.3000 పైనే తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.


 ఎరువుల వాడకం ఇలా.. 

వరిసాగులో పంట ఎదుగుదలకు రైతులు ఎరువులనే ఉపయోగిస్తారు. జిల్లాలో ఈ సార్వాలో 2 లక్షల 30 వేల హెక్టార్లలో వరిసాగు చేపట్టగా 2 లక్షల 3 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల వాడకం జరిగింది. ఇంకా 38,200 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ ఇన్‌చార్జ్‌ జేడీ జగ్గారావు తెలిపారు. దాళ్వాలో అయితే ఎరువుల వినియోగం మరింత ఎక్కువ ఉంటుంది.  

జిల్‌ ధరలతో పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు భారంగా మారుతున్నాయి. ఏటికేడాది పెట్టుబడులు పెరుగు తున్నాయి కానీ గిట్టుబాటు ధర మాత్రం అందడం లేదు. దీనికితోడు కూలి ధరలు, డీజిల్‌ సాగుపై ప్రభావం చూపుతున్నాయి. పెరిగిన ఎరువుల ధరలతో దాళ్వా పంటలో పెట్టుబడి భారీగా పెరగనుంది. ఇలా అయితే సాగు ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.