Abn logo
Oct 17 2021 @ 00:56AM

పురుగుల మందు తాగి ఎరువుల వ్యాపారి ఆత్మహత్య

ఓరుగంటి రవి మృతదేహం

ఖానాపూర్‌ రూరల్‌, అక్టోబర్‌ 16 : వ్యాపారంలో అరువు ఇచ్చిన డబ్బులు రాక పోవటంతో ఓ వ్యాపా రి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖానాపూర్‌ మండల ది లావర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓరుగంటి రవి (30) అనే వ్యాపారి ఆ నెల 14 న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అప స్మారకస్థితిలో పడిపోయాడు. ఇది గమనించి కుటుంబసభ్యులు వెంటనే నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 15న మృతి చెందాడు. రవి 4 సంవత్సరాల క్రితం ఖానాపూర్‌లో ఫర్టిలైజర్‌ షాపును నడిపాడు. ఆ వ్యాపారంలో పలువురికి అరువు ఇవ్వటం, ఇచ్చిన డబ్బులు రాకపోవటంతో షాపును మూసి వేసాడు. దీంతో తనకు అప్పులబాధ పెరగటంతో మానిసిక వేదనకు గురైనాడు. మన స్థాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో తల్లితండ్రులు తాగవద్దని వారించారు కానీ వ్యాపారంలో నష్టం వచ్చిన విషయాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ బాధతో కృంగి పోయేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య వరలక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నాడని, కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.