జేసీలకు ఎరువుల బాధ్యత

ABN , First Publish Date - 2020-06-05T09:46:47+05:30 IST

జిల్లాల్లో ఎరువుల నిర్వహణ బాధ్యతలను జూయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎరువుల కేటాయింపులు కలెక్టర్లు నిర్వహించే వారు. కొత్తగా రైతుభరోసా, రెవెన్యూ

జేసీలకు ఎరువుల బాధ్యత

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో ఎరువుల నిర్వహణ బాధ్యతలను జూయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు  ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎరువుల కేటాయింపులు కలెక్టర్లు నిర్వహించే వారు. కొత్తగా రైతుభరోసా, రెవెన్యూ పేరుతో ప్రతి జిల్లాకు మరో జేసీ(ఆర్‌బీఅండ్‌ఆర్‌)ని ప్రభుత్వం నియమించింది. కొత్త వ్యవస్థలో భాగంగా ఎరువుల సేకరణ, నిల్వలు, డీలర్లకు కేటాయింపులు, ఏజెన్సీలకు పంపిణీ తదితర వ్యవహారాల బాధ్యతలను జేసీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - 2020-06-05T09:46:47+05:30 IST