వెలుగుల పండుగ!

ABN , First Publish Date - 2020-11-14T05:30:00+05:30 IST

పిల్లలూ... ఈ రోజు దీపావళి పండుగ. టపాసులు కాల్చాలని ఎంతో ఉత్సాహంగా ఉండి ఉంటారు. కానీ టపాసులు కాల్చడం వల్ల

వెలుగుల పండుగ!

పిల్లలూ... ఈ రోజు దీపావళి పండుగ. టపాసులు కాల్చాలని ఎంతో ఉత్సాహంగా ఉండి ఉంటారు. కానీ టపాసులు కాల్చడం వల్ల జరిగే గాలి కాలుష్యం గురించి ఒక్కసారి ఆలోచించండి. అలా అని టపాసులు కాల్చకుండా ఉండమంటే ఉండలేరు కదా! అందుకే తక్కువ కాలుష్యం వెదజల్లే గ్రీన్‌ క్రాకర్స్‌ను మాత్రమే కాల్చండి. ఎక్కువ శబ్ధం చేసే టపాసుల జోలికి వెళ్లకండి.


 మట్టితో చేసిన ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించండి. వీలైతే ఆ ప్రమిదలకు మంచి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దండి. 


 దివ్వెలు వెలిగించే సమయంలో, టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాల బారినపడకుండా ఉండండి.


 బంధువులకు, స్నేహితులకు స్వీట్లు పంచి దీపావళి శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ దీపావళి అండ్‌ హ్యాపీ చిల్డ్రన్స్‌ డే.

Updated Date - 2020-11-14T05:30:00+05:30 IST