సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2022-01-17T05:23:55+05:30 IST

సంప్రదాయాల సందడి సంక్రాంతి పండుగ అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్‌రామ్‌, నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

సంక్రాంతి సందడి
విజేతలకు కప్పు అందిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

గోపాలపురం, జనవరి 16: సంప్రదాయాల సందడి సంక్రాంతి పండుగ అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్‌రామ్‌, నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని వేళ్లచింతలగూడెంలో ఆర్‌ఎం ఫౌండేషన్‌, సంక్రాంతి సంబ రాల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాల్లో వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నా రు. రంగవల్లులు, డూడూ బసవన్న, హరిదాసులను ఆదారించాన్నారు. కార్యక్రమంలో భాగంగా సినీ గీతాలాపన సభా ప్రాంగణాన్ని ఊర్రుతలూగిం చింది. టీవీ ఆర్టిస్ట్‌ హైపర్‌ ఆది బృంద సభ్యులతో హాస్యం పూయించటంతో సభాప్రాంగణం కేరింతలతో మారుమోగింది. కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి ప్రజలు భారీ తరలి వచ్చారు. క్రికెట్‌ పోటీల్లో విజేతలకు ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కప్‌ అందజేశారు. గ్రామాలు బంధుమిత్రుల రాక, కోడి పందేల హడావుడితో కిటకిటలాడాయి.


చాగల్లు: మండలంలో సంక్రాంతి పండుగను ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. మహిళలు రంగవల్లులతో సందడి చేశారు. కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. విజేతలకు రుడా చైర్మన్‌ షర్మిలరెడ్డి, సినీనటి స్నిగ్ధ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు కౌరు శ్రీనివాసరావు, కోడి నాగేశ్వరరావు, చిత్రసేనుడు, సంసాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


టి.నరసాపురం: అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకులు రంగనాథ శర్మ ఆధ్వర్యంలో గోపూజ నిర్వ హించారు. కనుమ పండుగ పశువును పూజించే పండుగగా జరుపుకుం టా రని ఆయన తెలిపారు. పశువులను పూజించడం వలన గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని ఏటా గోపూజ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-17T05:23:55+05:30 IST