పండగ స్పెషల్స్‌ పేరుతో.. రైల్వే దోపిడీ

ABN , First Publish Date - 2020-10-25T12:57:53+05:30 IST

పండగ స్పెషల్స్‌ పేరుతో రైల్వే శాఖ ఎడా పెడాగా టిక్కెట్‌ ఛార్జీలు పెంచి వసూలు చేస్తోన్నది. జూన్‌ నెలలో పునరుద్ధ రించిన స్పెషల్‌..

పండగ స్పెషల్స్‌ పేరుతో.. రైల్వే దోపిడీ

రాయితీలన్నింటిని నిలుపుదల చేసి తత్కాల్‌ ఛార్జీ బాదుడు

గతంలో జనరల్‌ భోగీలుగా ఉన్న వాటికి సెకండ్‌ సిట్టింగ్‌ ఛార్జీ వసూలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): పండగ స్పెషల్స్‌ పేరుతో రైల్వే శాఖ ఎడా పెడాగా టిక్కెట్‌ ఛార్జీలు పెంచి వసూలు చేస్తోన్నది. జూన్‌ నెలలో పునరుద్ధ రించిన స్పెషల్‌ ట్రైన్స్‌లో సాధారణ ఛార్జీలే వసూ లు చేస్తోన్నప్పటికీ రాయితీలు అమలు చేయడం లేదు. ఈ నెల 20వ తేదీ నుంచి పునరుద్ధరించిన కొన్ని రైళ్లకు మాత్రం తత్కాల్‌ ఛార్జీని వసూలు చేస్తోన్నారు. దీని వలన 500 కిలోమీటర్ల లోపు ఎంత దూరం ప్రయాణం చేసినా టిక్కెట్‌ ఽఛార్జీ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు గుంటూరు నుంచి నడికుడికి అయినా, గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు అయినా ఒకటే ఛార్జీ వసూలు చేస్తారు. దీంతో పండగ రైళ్లలో ప్రయాణం ప్రజలకు భారం గా మారింది. అయితే హైదరాబాద్‌కు ఆర్‌టీసీ బస్సులు లేకపోవడం, ప్రైవే టు బస్సుల్లో ఛార్జీలు అధికంగా వసూలు చేస్తోండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టిక్కెట్‌ ఛార్జీ ఎక్కువైనప్పటికీ రైళ్లని ఆశ్రయించక తప్పడం లేదు. కరోనకు ముందు వివిధ వర్గాలకు అమలులో ఉన్న రాయితీల్లో ఏ ఒక్క దానిని కూడా పునరుద్ధరించలేదు. 


ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ సూపర్‌ఫాస్ట్‌ కేటిగిరికి చెందినది. ఈ రైలులో గుంటూరు - సికింద్రాబాద్‌కు రూ. 210 టిక్కెట్‌ ఛార్జీ ఉన్నది. నరసపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కి టిక్కెట్‌ ఛార్జీ రూ. 375గా నిర్ణయించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌కు రూ. 385గా వసూలు చేస్తోన్నారు. గువహటి ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ లకి అయితే రూ. 415 వసూలు చేస్తో న్నారు. ఇలా ఒక్కో రైలుకు స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌ ఛార్జీల్లో వ్యత్యాసం ఉంటోన్నది. ఒక విధంగా గతంలో అమలు జరిగిన ఛార్జీలతో పోలిస్తే ఇవి రెట్టింపుగా ఉన్నాయి.  కాగా గతంలో ప్రతీ రైలుకు ముందు రెండు, వెనక రెండు జనరల్‌ భోగీలుండేవి. నేడు వాటిని సెకండ్‌ సిట్టింగ్‌ భోగీలుగా మార్చారు. దాంతో వాటిల్లో సీట్లకు కూడా రిజ ర్వేషన్‌ అమలు చేస్తోన్నారు. జనరల్‌ భోగీల్లో ఎదురెదురుగా ఎనిమిది మం ది కూర్చోవాల్సి ఉంటుంది. అలానే  రెండో వైపున మరో ఇద్దరు ఎదురెదు రుగా కూర్చోవాలి. దీని వలన ఆరు అడుగుల కనీస దూరం పాటించడం సాధ్యం కాదు. స్లీపర్‌క్లాస్‌తో పోల్చుకొంటే సెకండ్‌ సిట్టింగ్‌ ఛార్జీ తక్కువ కావడంతో చాలామంది వీటిల్లో ప్రయాణానికే మొగ్గు చూపుతోన్నారు. దీం తో కరోన వైరస్‌ వ్యాప్తికి ఈ భోగీల్లో ప్రయాణం ఊతమిచ్చేలా ఉన్నది. ఇది లావుంటే గతంలో వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివి ధ రకాల రోగులు, సైన్యంలో పని చేసే జవాన్లు తదితర కేటిగిరీలకు రైలు ప్రయాణంలో రాయితీ ఉండేది. వాటిని ఎత్తివేసింది. దీంతో ఆయా కేటిగిరీ లకు చెందిన వారిపై రైలు ప్రయాణం ఆర్థికంగా భారాన్ని మోపుతోన్నది. 


Updated Date - 2020-10-25T12:57:53+05:30 IST