స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం

ABN , First Publish Date - 2022-04-22T05:57:50+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఆధీనంలో వరి కొనుగోలు కేంద్రా లను అధికారులు ప్రారంభిస్తున్నారు.

స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం
మిడ్జిల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- భూత్పూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల


మిడ్జిల్‌/ బాలానగర్‌/ భూత్పూర్‌/ అడ్డాకుల/ గండీడ్‌/ దేవరకద్ర, ఏప్రిల్‌ 21 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఆధీనంలో వరి కొనుగోలు కేంద్రా లను అధికారులు ప్రారంభిస్తున్నారు. యాసంగి ధాన్యం విక్రయించుకో వడానికి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మిడ్జిల్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సిలక్ష్మారెడ్డి ప్రారంభించారు. భూత్పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గండీడ్‌ మండల పరిధిలోని చిన్నవార్వాల్‌ గ్రా మంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. 

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అంటే, టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల పండుగలా మారిందని అన్నారు. గురువారం మిడ్జిల్‌ పీఏసీఎస్‌ కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్‌ రైతులకు ఇబ్బంది లేకుండా వరి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు గగ్గోలు పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మిమోసపోవద్దని లక్ష్మారెడ్డి సూచించారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్ల ప్రభాకర్‌రెడ్డి, బాదేపల్లి మార్కెట్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్‌ రాధిక, ఎంపీపీ కాంతమ్మ, జడ్పీటీసీ శశిరేఖ, డీసీవో సుధాకర్‌, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఏవో సిద్ధార్థ, సీఈవో బాల్‌రెడ్డి, డైరెక్టర్లు భీమయ్య, జంగమ్మ, నాయకులు వెంకట్‌రెడ్డి, బాలస్వామి, బాలు, బాల్‌రెడ్డి, జంగారెడ్డి, సుదర్శన్‌, ప్రతాప్‌రెడ్డి, జగన్‌గౌడ్‌, భాస్కర్‌, శ్రీనివాసులు, బంగారు, సుకుమార్‌, నర్సింహ, కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. 


ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన డీఎస్పీ 


మండలంలోని రాణిపేట గ్రామంలోని ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డిని నూతనంగా విధుల్లో చేరిన డీఎస్పీ మహేశ్‌గౌడ్‌ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఆయన వెంట డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, సీఐ జములప్ప, ఎస్‌ఐలు జయప్రసాద్‌, శ్రీనివాస్‌, నాయకులు, పోలీసులు ఉన్నారు.


ఫ బాలానగర్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో రబీసీజన్‌కు సంబంధించిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ వాల్యానాయక్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వెంకటాచారి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో కృష్ణారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, లక్ష్మణ్‌ నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ఏవో ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్రాములు, టీఆర్‌ఎస్‌ యూత్‌వింగ్‌ అధ్యక్షుడు సుప్ప ప్రకాష్‌, బాలయ్య ఉన్నారు.

ఫ గురువారం భూత్పూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఎడారిగా ఉన్న పాలమూరు జిల్లా నేడు పచ్చ ని పంటలతో కళకళలాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, మండల రైతు బంధు అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, నాయకులు మేకల సత్య నారాయణ, నారాయణగౌడ్‌, పోతులమడుగు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చంద్ర శేఖర్‌గౌడ్‌, సాయిలు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12 మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3,57,500 చెక్కులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఫ అడ్డాకుల మండల పరిధిలోని చిన్నమునుగాల్‌చెడ్‌, తిమ్మాయిపల్లి, బలీద్‌పల్లి గ్రామాలలో గురువారం ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు జితేందర్‌ రెడ్డి, ఎంపీటీసీ రంగన్నగౌడ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఖాజాఘోరి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసులు, సీఈఓ వెంకటయ్య, డీపీఎం(ఫైనాన్స్‌)దామోదర్‌, డీపీఎం చెన్నయ్య, ఎంపీడీఓ మంజుల, ఏపీఎం సుధీర్‌, గ్రామ రైతుబంధు అధ్యక్షులు, సీసీలు, వీఓఏలు, రైతులు పాల్గొన్నారు.

గురువారం గండీడ్‌ మండల పరిధిలోని చిన్నవార్వాల్‌ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ అంజిలమ్మ, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ గిరెమోని లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు వెంకట్‌, అశోక్‌గౌడ్‌, జూలపల్లి సర్పంచ్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, నర్సప్ప, రమేష్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం బాలకృష్ణ, మండల ఇన్‌చార్జి వ్యవసాయాధికారి మహేష్‌ యాదవ్‌, మహిళా సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఫ దేవరకద్ర మండల పరిధిలోని హజిలాపూర్‌, లక్ష్మిపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ రమాశ్రీకాంత్‌ యాదవ్‌ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2022-04-22T05:57:50+05:30 IST