ఫ్లిప్‌కార్ట్.. ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ అమ్మకాలు‌... అ‘ధర’హో... తగ్గింపే తగ్గింపు...

ABN , First Publish Date - 2020-12-01T00:39:30+05:30 IST

పండుగలు, సెలవులు... ‘ఈ-కామర్స్’ సంస్థలకు నిజంగా పండుగ రోజులే. ఈ సందర్భాల్లో... ఆయా సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తూంటాయి. తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్.. ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్’ అమ్మకాలు‌... అ‘ధర’హో... తగ్గింపే తగ్గింపు...

బెంగళూరు : పండుగలు, సెలవులు... ‘ఈ-కామర్స్’ సంస్థలకు నిజంగా పండుగ రోజులే. ఈ సందర్భాల్లో... ఆయా సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తూంటాయి. తగ్గింపు ధరలతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి.


ఇదే క్రమంలో... తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ మరోమారు ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 1 నుండి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును అందించనుంది.  ‘ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్‌’ పేరుతో బంప‌ర్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ‘ఫ్లిప్‌కార్ట్.కామ్‌’లో ఈ అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. 


తాజా ఆఫర్ల నేపధ్యంలో టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపునిస్తోంది. క్రీడలు, ఫర్నిచర్, గృహాలంకరణ, సౌందర్య తదితర ఉత్పత్తులపై రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. పాదరక్షలు, బట్టలు, క్రీడా పరికరాలు, ఫర్నీచర్, గృహాలంక‌ర‌ణ‌ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌పై కూడా త‌గ్గింపును ప్ర‌క‌టించింది.


హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 70 శాతం వరకు తగ్గింపునందిస్తోంది. ఇక... ల్యాప్‌టాప్‌లపై 30 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇక...  స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌ వంటివాటిపై కూడా తగ్గింపు ధరలను ప్రకటించింది. మరోవైపు ‘నోకాస్ట్ ఈఎంఐ’ స‌దుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్లు, వారంటీ పొడ‌ిగింపు వంటి స‌దుపాయాలను కూడా అందుబాటులో ఉండనున్నాయి. 

Updated Date - 2020-12-01T00:39:30+05:30 IST