జ్వరం...భయం

ABN , First Publish Date - 2022-01-27T06:31:58+05:30 IST

జిల్లా ప్రజలను జ్వరం కలవర పెడుతోంది. ఎక్కడా చూసినా దగ్గులు, తుమ్ములు. ఏ ఇంటికి వెళ్లినా జ్వరంతో బాధపడుతూ కనిపిస్తు న్నారు. ఏ జ్వరమైనా తగ్గేవ రకు వణికి పోతున్నారు.

జ్వరం...భయం

- దగ్గు, తుమ్ములతో బేంబేలెత్తుతున్న జనం

- ఫీవర్‌ సర్వేలో 3017 మంది గుర్తింపు 

- విజృంభిస్తున్న కరోనా 

-  పాజిటివ్‌తోనే తిరుగుతున్న జనం 

సిరిసిల్ల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజలను జ్వరం కలవర పెడుతోంది. ఎక్కడా చూసినా దగ్గులు, తుమ్ములు. ఏ ఇంటికి వెళ్లినా జ్వరంతో  బాధపడుతూ కనిపిస్తు న్నారు. ఏ జ్వరమైనా తగ్గేవ రకు వణికి పోతున్నారు. ఓవైపు  థర్డ్‌వేవ్‌లో కరోనా మహ మ్మారి విజృంభిస్తోంది. మరోవైపు చల్లని ఈదు రు గాలులు మంచాన పడేస్తున్నాయి. దీంతో సాధా రణ జ్వరమో..కొవిడో జ్వరమో తెలియక  ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. అనేకమంది నిర్లక్ష్యం కూడా వైరస్‌ వ్యాప్తికి దోహద పడుతోంది.  పాజిటివ్‌ లక్షణాలు ఉన్నావారు, పాజిటివ్‌ నిర్ధారణ అయ్యి పూర్తిగా కోలుకోకముందే జనాల్లో తిరుగుతు న్నారు. హోం క్వారంటైన్‌ నిబంధనలు పట్టించు కోవడం లేదు. గడిచిన 26 రోజుల్లో రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నా యి. వైరస్‌  నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన ఫీవర్‌ సర్వేలో కొవిడ్‌ లక్షణాలతో ఉన్న వారు రోజుకు వందల సంఖ్యలోనే బయట పడుతున్నారు. జిల్లాలో ఫీవర్‌ సర్వే ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 3017 మంది కొవిడ్‌ లక్ష ణాలతో ఉన్న జ్వరపీడితులను గుర్తించి కిట్లను అందిం చారు. జిల్లాలో ప్రస్తుతం 431 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 1,40,932 ఇళ్లలో సర్వే చేశారు. బుధవారం 216 మందిని గుర్తించి కిట్లను అందజేశారు.  జ్వరపీడి తులను ఇళ్లలో ఉండే విధంగా నియంత్రించకపోవడంతోనే కరోనా, జ్వరాల వ్యాప్తి పెరుగుతోందని పలువురు భావిస్తున్నారు. 

నెలలోనే 2వేలకు పైగా కేసులు 

జిల్లాలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తోంది. ఫస్ట్‌వేవ్‌, సెకండ్‌వేవ్‌లో 32,386 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ప్రస్తుతం ధర్డ్‌వేవ్‌లో జనవరి 26 వరకే 2150కి పైగా కేసులు వచ్చాయి. జిల్లాలో 8.21 శాతం పాజిటివ్‌ రేటు కొనసాగుతోంది.  మరోవైపు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ రాగా ప్రైమరీ కాంటాక్ట్‌తో మరో ఇద్దరు పాజిటివ్‌ బారిన పడ్డారు.  జిల్లాలోని అన్నీ శాఖల ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లడా నికే ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా జనం మాత్రం కనీస భౌతికదూరం, మాస్క్‌లు ధరించకపో వడంతో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

78 మందికి కరోనా పాజిటివ్‌ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం 647 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 78 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో తంగళ్లపల్లి మండలంలో 14 మంది, కోనరావుపేట ఇద్దరు, గంభీరావుపేట ముగ్గురు, ముస్తాబాద్‌ ఇద్దరు, ఎల్లారెడ్డిపేట  10 మంది, వేములవాడ 14 మంది, బోయినపల్లి ఒక్కరు, సిరిసిల్లలో 32 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో ఇప్పటివరకు 34,588 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ రాగా 32,570 మంది కోలుకున్నారు. 1448 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 570 మంది మృతిచెందారు. 

Updated Date - 2022-01-27T06:31:58+05:30 IST