ఫీవర్‌ సర్వే బృహత్తర కార్యక్రమం

ABN , First Publish Date - 2022-01-22T04:08:12+05:30 IST

ఫీవర్‌ సర్వే ఓ బృహత్తర కార్యక్రమమని, దేశంలోనే తెలం గాణ ప్రభుత్వం మొదటిసారి చేపట్టిందని కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విలే కరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా థర్డ్‌వేవ్‌లో అంత తీవ్రత లేకపోయినా వేగంగా విస్తరిస్తోంద న్నారు. వైరస్‌ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామ రక్ష అన్నారు.

ఫీవర్‌ సర్వే బృహత్తర కార్యక్రమం
పాత్రికేయులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతీ హోళికేరి

కొవిడ్‌ నియంత్రణకు అన్ని ఏర్పాట్లు

జాగ్రత్తలు పాటించడమే శ్రీరామ రక్ష

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ భారతి హోళికేరి

మంచిర్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఫీవర్‌ సర్వే ఓ బృహత్తర కార్యక్రమమని, దేశంలోనే తెలం గాణ ప్రభుత్వం మొదటిసారి చేపట్టిందని కలెక్టర్‌ భారతిహోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విలే కరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా థర్డ్‌వేవ్‌లో అంత తీవ్రత లేకపోయినా వేగంగా విస్తరిస్తోంద న్నారు. వైరస్‌ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామ రక్ష అన్నారు. ఇంటింటా ఆరో గ్యం పేరుతో జిల్లా వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.36 లక్షల నివాస గృహాల్లో సర్వే చేపట్టనున్నట్లు కలె క్టర్‌  పేర్కొన్నారు. జ్వరం, జలుబు, దగ్గు రాగానే కొవి డ్‌ కాదని, మొదటగా వాటికి చికిత్స తీసుకోవాల న్నారు. ఇందుకుగాను అర్బన్‌ ఏరియా, గ్రామీణ ప్రాం తాల్లో 485 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బృందాల సభ్యులు జ్వరంతో బాధపడు తున్న వారి వివరాలు సేకరించి జ్వర బాధితులు, ఇతర లక్షణాలున్న వారికి ఐదు రోజులకు సరిపడా మెడికల్‌ కిట్‌ అందజేస్తారన్నారు. లక్షణాలు అలాగే ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌ నిర్ధా రణ పరీక్షలు నిర్వహించి, హోం ఐసోలేషన్‌లో ఉం డేలా సూచిస్తారు. గురువారం వరకు జిల్లాలో 316 మందికి జ్వరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లా లో 799 బెడ్స్‌ సిద్ధం చేశామని పేర్కొన్నారు.   బెల్లం పల్లి కొవిడ్‌ ఆస్పత్రిలో 100కు పైగా ఆక్సిజన్‌ బెడ్స్‌, పిల్లలకు సోకే అవకాశం ఉండటంతో జిల్లా ఆస్పత్రిలో 20 బెడ్లతో ప్రత్యేక వార్డు ఏర్పాటు. కొవిడ్‌ సోకిన గర్భిణీలకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని తెలిపారు.

వేగంగా వ్యాక్సినేషన్‌ 

వ్యాక్సినేషన్‌ కారణంగా వైరస్‌ తీవ్రత తగ్గుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మొదటి డోసులో జిల్లాలో 105 శా తంతో  జిల్లా లక్ష్యాన్ని అధిగమించింది. రెండో డోసులో 84 శాతానికి చేరుకుంది. జిల్లాలో 15-18 ఏళ్ల లోపు వారు 5.36 లక్షల టార్గెట్‌ ఉండగా ఇప్పటికి 81 శాతం పూర్తి చేశామన్నారు. బయటి జిల్లాల వారు 600 మం ది విద్యార్థులు జిల్లాలో అభ్యసిస్తుండగా మరో 150 మంది మహారాష్ట్రలోనిసిరోంచాకు చెందిన వారున్నారు. బూస్టర్‌ డోసు కూడా జిల్లాలో ప్రారంభమైందని, సొం త వైద్యం కాకుండా బృందాలు అందజేసే మెడికల్‌ కిట్లు వాడితే ప్రయోజనం ఉంటుందని, స్టెరాయిడ్‌ వాడకాన్ని తగ్గించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజలు  కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉందని, 08736-250501 నెంబర్లో సేవలు వినియోగించుకోవాలని కోరారు.


Updated Date - 2022-01-22T04:08:12+05:30 IST