విప్రోతో ఫియట్‌ క్రిస్లర్‌ ఒప్పందం

ABN , First Publish Date - 2021-01-16T07:05:38+05:30 IST

హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌కు వ్యూహాత్మక టెక్నాలజీ సర్వీసెస్‌ భాగస్వామిగా విప్రోను ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఏ) ఎంపిక చేసింది

విప్రోతో ఫియట్‌ క్రిస్లర్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌కు వ్యూహాత్మక టెక్నాలజీ సర్వీసెస్‌ భాగస్వామిగా విప్రోను ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఏ) ఎంపిక చేసింది. ఎఫ్‌సీఏకు ఇదే తొలి డిజిటల్‌ హబ్‌. ఒప్పందంలో భాగంగా 1000 మందికి పైగా నిపుణులు, టెక్నాలజిస్టులను సమీకరించి ‘ఎఫ్‌సీఏ ఐటీసీ ఇండియా’ హబ్‌కు అందిస్తుంది. మొబిలిటీలో ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీలపై వీరు పని చేస్తారని విప్రో వెల్లడించింది. ప్రీమియం మొబిలిటీ సేవలు అందించడంపై దృష్టి పెట్టేందుకు హైదరాబాద్‌లో తొలి గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు దాదాపు నెల రోజుల క్రితం ఎఫ్‌సీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2021-01-16T07:05:38+05:30 IST