క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన

ABN , First Publish Date - 2020-10-29T07:01:33+05:30 IST

మండలంలోని వెంకట్రావుపేట, చందారం గ్రామాల్లో బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు, లక్షెట్టిపేట వ్యవసాయ శాఖాధికారులు వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన

లక్షెట్టిపేట రూరల్‌, అక్టోబరు 28:  మండలంలోని వెంకట్రావుపేట, చందారం గ్రామాల్లో బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు, లక్షెట్టిపేట వ్యవసాయ శాఖాధికారులు వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉష్ణోగ్రతల పెరుగుదల ద్వారా వరి పంటకు సోకే తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. చీడ, పీడల యాజమాన్యంపై అదే విధంగా వరిపంటకు సోకే ఇతర తెగుళ్లు వాటి నివారణకు తీసుకోవల్సిన చర్యలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగరాజు, తిరుపతి, లక్షెట్టిపేట వ్యవసాయ శాఖాధికారి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీటీసీ బత్తుల సత్తయ్య, ఏఈఓలు మహేష్‌, మౌనిక, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T07:01:33+05:30 IST