కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలు

ABN , First Publish Date - 2020-08-13T10:00:30+05:30 IST

కొవిడ్‌-19 విస్తరిస్తున్న కారణంగా ఈసారి పంద్రాగస్టు వేడుకలను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించనున్నారు

కలెక్టరేట్‌లో పంద్రాగస్టు వేడుకలు

హాజరు కానున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కొవిడ్‌-19 విస్తరిస్తున్న కారణంగా ఈసారి పంద్రాగస్టు వేడుకలను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు ఎంపీ రంజిత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఎమ్మె ల్సీలు, డీసీసీబీ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్లు, అధికారులు హాజరు కానున్నారు. 


వికారాబాద్‌ జిల్లాలోని వేడుకలకు ఉపసభాపతి పద్మారావు 

వికారాబాద్‌ : స్వాతంత్య్ర వేడుకలను జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా వేడుకలను సాధారణంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వేడుకల్లో పాల్గొనే వారందరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈనెల 15న కలెక్టరేట్‌ ఆవరణలో ఉదయం 10గంటలకు ఉపసభాపతి పద్మారావు జాతీయజెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, జిల్లా ఎస్పీ నారాయణ, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ బోగేశ్వర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారి రాజేశ్వర్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

మేడ్చల్‌ అర్బన్‌ : స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండ కూడదని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ఆవరణలో స్టేజీ తదితర ఏర్పాట్లపై పలు సూచ నలు చేశారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నం దున వాటర్‌ప్రూఫ్‌ శామియానాలు వేయాలని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతికదూరం పాటిం చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్‌రావు ఉన్నారు. 

Updated Date - 2020-08-13T10:00:30+05:30 IST