విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిపై నిఘా

ABN , First Publish Date - 2020-03-28T13:59:01+05:30 IST

విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన 15 లక్షల మందిని పరీక్షించి క్వారంటైన్ నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం....

విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిపై నిఘా

  • రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి సంచలన లేఖ 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గత రెండు నెలలుగా విదేశాల నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన 15 లక్షల మందిని పరీక్షించి క్వారంటైన్ నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా వివిధ దేశాల నుంచి జనవరి 15 నుంచి మార్చి 23వతేదీ వరకు స్వదేశానికి 15 లక్షల మంది తిరిగివచ్చారని, వారందరికీ వైద్యపరీక్షలు జరిపి క్వారంటైన్ నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.


విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొందరి ఆచూకీ లేదని, వారంతా కనీసం 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు చూడాలని కేంద్రం రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి 15 లక్షల మంది స్వదేశానికి తిరిగివచ్చారని కేంద్ర హోం మంత్రిత్వశాఖ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సమాచారం అందించిందని, వీరిపై నిఘా పెట్టాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు.


విదేశాల నుంచి వచ్చిన 15లక్షల మందిలో కొంతమందికే పరీక్షలు చేశారని కేంద్రం పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన వారు నివాసముంటున్న ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రం సూచించింది. 170 దేశాల్లో కరోనావైరస్ ప్రబలిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. 

Updated Date - 2020-03-28T13:59:01+05:30 IST