Abn logo
Oct 1 2020 @ 06:19AM

కొత్తగా మరో 82 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా

Kaakateeya

58 మంది జవాన్ల మృతి

న్యూఢిల్లీ : సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్) విభాగంలో కరోనా మహమ్మారికి తెరపడటం లేదు.దేశంలోని పలు సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో ఒక్క బుధవారం రోజే కొత్తగా 82 మందికి కరోనా వైరస్ సోకడంతో జవాన్లు ఆందోళన చెందుతున్నారు.కరోనా వల్ల ఇప్పటివరకు 82 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. బుధవారం 234 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోని అన్ని సీఆర్‌పీఎఫ్ యూనిట్లలో 11,072 మందికి కరోనా సోకగా, వారిలో 9,416 మంది కోలుకున్నారు. మరో 1598 మంది సీఆర్‌పీఎఫ్ ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. మిజోరంలో 23 మందికి కరోనా సోకింది. 

ఐజ్వాల్ సీఆర్‌పీఎఫ్ విభాగంలో 14 మందికి సెర్ చిప్ లో 11 మంది, లుంగ్ లే లో ఇద్దరికి కరోనా వచ్చింది.మరో 15 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు, ఏడుగురు అసోం రైఫిల్సు జవాన్లు కరోనా బారిన పడ్డారు. మిజోరంలో 410 మంది బీఎస్ఎఫ్ జవాన్లు, 206 మంది అసోం రైఫిల్స్ జవాన్లు, 18 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు కరోనా సోకిందని అధికారులు చెప్పారు.32 మంది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సు జవాన్లు, 36 మంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు కూడా కరోనా సోకింది.

Advertisement
Advertisement
Advertisement