ఫిఫ్టీ..ఫిఫ్టీ

ABN , First Publish Date - 2021-07-13T06:08:23+05:30 IST

తాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు 50 శాతమే ఉన్నాయని వింబుల్డన్‌ చాంపియన్‌ నొవాక్‌

ఫిఫ్టీ..ఫిఫ్టీ

విశ్వక్రీడల్లో  ప్రాతినిథ్యంపై జొకోవిచ్‌


లండన్‌: తాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు 50 శాతమే ఉన్నాయని వింబుల్డన్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తెలిపాడు. కరోనా వైర్‌సతో టోక్యోలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే విషయంలో జొకో పునరాలోచనలో పడ్డాడు. ‘విశ్వక్రీడల బరిలో దిగాలనే అనుకున్నా. కానీ టోక్యోలో పరిస్థితులపై కొద్ది రోజులుగా వస్తున్న వార్తలతో అక్కడి వెళ్లే అవకాశాలు 50 శాతమే ఉన్నాయి’ అని నొవాక్‌ చెప్పాడు.


ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత: ఈ ఏడాది ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి ఆటగాడిగా వరల్డ్‌ నెం.1 జొకో నిలిచాడు. ఈ టోర్నీ వచ్చే నవంబరు 14 నుంచి 21 వరకు ఇటలీలోని ట్యూరిన్‌లో జరగనుంది. ఏటీపీ ఫైనల్స్‌లో కనుక నొవాక్‌ విజేతగా నిలిస్తే ఆ టోర్నీని రికార్డు స్థాయిలో ఆరు సార్లు నెగ్గిన ఫెడరర్‌ సరసన అతడు నిలుస్తాడు. 


Updated Date - 2021-07-13T06:08:23+05:30 IST