ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ABN , First Publish Date - 2021-01-18T05:45:08+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై పోరాడాలని, వామ పక్ష భావజాల పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని సీపీఐ రాష్ట్ర కారద్యర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నా రు. మండలంలోని రామలక్ష్మణపల్లెలో ఇటీవల మరణించిన సీపీఐ నాయకు రాలు గుంటి రాజవ్వ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
నివాళుర్పిస్తున్న చాడ వెంకట్‌రెడ్డి, విమలక్క

ముస్తాబాద్‌, జనవరి 17: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై పోరాడాలని,  వామ పక్ష భావజాల పార్టీలన్నీ ఒక్కతాటిపైకి  రావాలని సీపీఐ రాష్ట్ర కారద్యర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నా రు.  మండలంలోని రామలక్ష్మణపల్లెలో ఇటీవల మరణించిన  సీపీఐ నాయకు రాలు గుంటి రాజవ్వ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు.  ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగాలను పెట్టు బడిదారులకు కట్ట బెడుతున్నారని,  ధరణి వెబ్‌సైట్‌తో సన్న చిన్న కారు రైతులు నష్ట పోతున్నారని అన్నారు.  అనంతరం తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ సిరిసిల్లలో జరిగిన ఉద్యమాలను, అమరులను స్మరించుకొని ముందుకుసాగాలన్నారు. అంతకుముందు గుంటి రాజవ్వకు నివాళులర్పించారు.  సీపీఎం న్యూ డెమోక్రసీ కార్యదర్శి చలపతిరావు, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి  మల్లేశం, వేణు,  రమేశ్‌, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, భాను పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-18T05:45:08+05:30 IST