Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి మండపం వద్దకు వెళ్లిన తర్వాత ట్విస్ట్ ఇచ్చిన వరుడి స్నేహితులు.. ఆగ్రహంతో ఊగిపోయిన పెళ్లి కొడుకు.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి..

ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అందరూ ఒక దగ్గర కూర్చుని.. పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. అనంతరం పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో పెళ్లి రోజు రానే వచ్చింది. వివాహ వేడుకలో భాగంగా పెళ్లి కొడుకును మండపంలోకి తీసుకెళ్లేందుకు వధువు కుటుంబ సభ్యులు వరుడి వద్దకు చేరుకున్నారు. అనంతరం బ్యాండ్ మేళంతో అతడిని పెళ్లి మండపం వరకూ తీసుకెళ్లారు. ఈ సమయంలోనే సడన్‌గా ఎంటరైన వరుడి స్నేహితులు ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వారికి ఈ నెల 20న పెళ్లి చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు వరుడిని పెళ్లి మండపానికి తీసుకొచ్చేందుకు వధువు తరఫు వాళ్లు బ్యాండ్ మేళంతో వెళ్లారు. సంప్రదాయబద్దంగా పెళ్లి కొడుకుని మండపం  వద్దకు తీసుకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో పెళ్లి కొడుకు స్నేహితులు అక్కడకు ఎంటరై ట్విస్ట్ ఇచ్చారు. బ్యాండ్ మేళానికి తగ్గట్టు స్టెప్పులు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముహూర్తం సమయం దగ్గరకొచ్చింది.

దీంతో డ్యాన్స్ చేయడం ఇక ఆపాలని వధువు తరఫు వాళ్లు, ఊరి ప్రజలు పెళ్లి కొడుకు స్నేహితులను కోరారు. అయితే దానికి వాళ్లు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ఊరి ప్రజలు, వధువు కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో వరుడి స్నేహితులకు, అమ్మాయి తరఫు వాళ్లకు మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో వరుడు ఆగ్రహానికి లోనయ్యాడు. ‘నా స్నేహితులనే తిడతారా’ అంటూ తిన్నగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మండపం వద్ద ఉండి మరీ.. అతడి పెళ్లి జరిపించారు. దీంతో ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement