అగ్గిపెట్టె లేదన్నందుకు ఎంత పనిచేశాడో చూడండి..!

ABN , First Publish Date - 2021-12-08T14:03:37+05:30 IST

అగ్గిపెట్టె లేదన్నందుకు ఎంత పనిచేశాడో చూడండి..!

అగ్గిపెట్టె లేదన్నందుకు ఎంత పనిచేశాడో చూడండి..!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : అగ్గిపెట్టె లేదన్నందుకు యువకుడిపై దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన సురేష్‌, శివ, నాగార్జున విద్యార్థులు. వీరంతా రహ్మత్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఈనెల 6న నాగార్జున, శివ టీ తాగేందుకు బయటకు వెళ్లారు. కొద్ది సేపటికి తిరిగి వచ్చి గది ఎదుట కూర్చొని సెల్‌ఫోన్‌ చూస్తున్నారు. లతీఫ్‌ షేక్‌ అనే వ్యక్తి వచ్చి నాగార్జునను అగ్గిపెట్టె ఉందా అని అడగగా లేదని చెప్పాడు. అనంతరం నాగార్జున, శివ కలిసి ఇంటి మెట్లు ఎక్కుతుండగా లతీఫ్‌షేక్‌ వెనకాలే వచ్చి శివ కాళ్లు పట్టుకొని కిందకు లాగగా అతడి ఎడమ కాలు విరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T14:03:37+05:30 IST