ప్రజలకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2021-07-29T05:36:58+05:30 IST

ప్రజల కు అన్ని వేళలా అండగా ఉం డి, వారి సమస్యల పరిష్కా రం కోసం పనిచేయాలని ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సూచించారు.

ప్రజలకు అండగా ఉండాలి
ఎమ్మెల్యే రవికుమార్‌కు బొకే ఇస్తున్న రామకృష్ణ

ఎమ్మెల్యే గొట్టిపాటి


అద్దంకి, జూలై 28 : ప్రజల కు అన్ని వేళలా అండగా ఉం డి, వారి సమస్యల పరిష్కా రం కోసం పనిచేయాలని ఎ మ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సూచించారు. టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఉ పాధ్యక్షుడిగా నియమితులైన ఏఎంసీ మాజీ చైర్మన్‌ నాగినేని రామకృష్ణ,  తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి నాగబోతు సుజాత బుధవా రం చిలకలూరిపేటలో రవికుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా వారికి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.  

 బల్లికురవ : గుండెపోటుతో మృతి చెందిన నక్కబొక్కలపాడు మాజీ సర్పంచ్‌ పావులూరి సుబ్బారావు మృతదేహాన్ని ఎమ్మెల్యే రవికుమార్‌ బుధవారం సందర్శిం చారు. ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. అంబడిపూడిలో ఇటీవల మృ తి చెందిన గంగవరపు రవీంద్ర ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుంటుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు మలినీడి గోవిందరావును కలిసి మాట్లాడారు. 


Updated Date - 2021-07-29T05:36:58+05:30 IST