ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-01-24T04:55:44+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా కేబినెట్‌లో ఆమోదించి జీవోలు జారీచేయడాన్ని తప్పుబట్టారు. ఆ జీవోలను ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్ని కలిసికట్టుగా నిర్వహించాలని నిర్ణయించారు. కూచిపూడి శరత్‌బాబు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం స్థానిక ఎన్‌జీవో భవన్‌లో పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఎతో పాటు ఇతర రాయితీలను తగ్గిస్తూ జారీచేసిన జీవోలతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం
ఒంగోలు ఎన్‌జీవో భవన్‌లో జరిగిన పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ సంఘాల నేతల అభివాదం

పీఆర్సీ సాధన సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సంఘాల నేతలు

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 23: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా కేబినెట్‌లో ఆమోదించి జీవోలు జారీచేయడాన్ని తప్పుబట్టారు. ఆ జీవోలను ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమాన్ని కలిసికట్టుగా నిర్వహించాలని నిర్ణయించారు. కూచిపూడి శరత్‌బాబు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం స్థానిక ఎన్‌జీవో భవన్‌లో పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఎతో పాటు ఇతర రాయితీలను తగ్గిస్తూ జారీచేసిన జీవోలతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ఒకవైపు ఆందోళన చేస్తుండగా ప్రభుత్వం దీనిపై చర్చలు జరపకుండానే కేబినెట్‌లో ఆమోదించి రాత్రికిరాత్రే జీవోలు జారీచేసి ఫిబ్రవరిలో కొత్త పీఆర్సీతో వేతనాలు ఇవ్వాలని చూడడం దుర్మార్గంగా ఉందన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఉద్యమం చేసేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. పీఆర్సీ రాష్ట్ర సాఽధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 25న జిల్లాలో ర్యాలీలు, ధర్నాలు. 26న అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు, 27 నుంచి 30వతేదీ వరకు  జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రిలేదీక్షలు, వచ్చేనెల 3న చలో విజయవాడను విజయవంతం చేయాలని కోరారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే 5న సహాయ నిరాకరణ, 7 నుంచి సమ్మె ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో  నాయకులు కె.ప్రసన్నాంజనేయులు, కె.వెంకటేశ్వర్లు, పీసువర్ణబాబు, వి.జనార్దన్‌రెడ్డి, రామ్మోహన్‌రావు, జేవి.కృష్ణారావు, ఎన్‌.శ్రీనివాసరావు, ఎం.వెంకటేశ్వర్లు, టీ వెంకటేశ్వరరెడ్డి, కేపీ.రంగనాయకులు, బి.అశోక్‌కుమార్‌, శేషుబాబు, విద్యాసాగర్‌రెడ్డి, డి.మధు, నూర్‌బాషా, ఎస్‌కే నాసర్‌వలి, దిలీప్‌, డి.శ్రీనివాసులు, ఎం.మాధవరావు, టి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, చిరంజీవి, సత్యనారాయణ, కె.వెంకట్రావు, ఆర్‌.. అంజయ్య, బి.శివాజీ, వై.వెంకట్రావు, పీవీ సుబ్బారావు, పీవీ.నారాయణ పాల్గొన్నారు. 

అందరం కలిసికట్టుగా ముందుకుపోదాం:

-కె.శరత్‌బాబు, పీఆర్సీసాదన సమితి చైర్మన్‌  

ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. రివర్స్‌ పీఆర్సీతోనే రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్కారు సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అందులో ఉద్యోగులు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపునకు అనుగుణంగా ముందుకు పోదాం.

ప్రభుత్వం మెడలు వంచి సాధిద్దాం

- ఆర్‌వీఎస్‌ కృష్ణమోహన్‌, ఏపీఆర్‌ఎ్‌సఏ జిల్లా అధ్యక్షుడు  

ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. గతంలో ఏన్నడు లేని విధంగా ఈసారి ఉద్యోగులకు తీవ్రనష్టం జరిగే విధంగా జీవోలు జారీచేసింది. ఆ జీవోలను రద్దుచేసి యథావిదిగా కొనసాగించాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దాం.

ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోవాలి:

- చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఉద్యోగులను వ్యతిరేకిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో గతంలో జరిగిన ఘటనలు చూసి తెలుసుకుంటే మంచిది. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేసేందుకై వెనుకాడేది లేదు. 

ప్రభుత్వ ఉద్యోగులకు  తీవ్ర అన్యాయం  

- ఎస్‌, రవి, యూటీఎఫ్‌ నాయకుడు

ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులు చలో కలెక్టరేట్‌ ద్వారా సత్తా ఏమిటో చూపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు కూడా వెనుకాడేది లేదు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ ఉద్యమం చేద్దాం. 

జీవోలను వెనక్కు తీసుకోవాలి

-బిఅశోకుమార్‌, ఏపీటీఎఫ్‌ నాయకుడు 

ప్రభుత్వం రివర్స్‌ పీఆర్సీ జీవోలు వెనక్కు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగా లేదనే కారణంతో ఉద్యోగుల వేతనాలు తగ్గించడం దారుణం. గతంలో ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇచ్చిన పరిస్థితి లేదు. విధానాలను ప్రభుత్వం విడనాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. 


Updated Date - 2022-01-24T04:55:44+05:30 IST