Abn logo
Jul 27 2021 @ 11:53AM

ఒంటి నిండా సూదులు, ట్యూబులే... భరించలేకపోతున్నాను

‘‘గడిచిన కొన్ని వారాల్లో నా కుమారుడికి నాలుగు ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడింకా ఐసీయూలోనే ఉన్నాడు. నా బిడ్డ ఎంత బాధలో ఉన్నాడనే ఊహ కూడా భరించలేకపోతున్నా’’. మా పదేళ్ల అబ్బాయి హర్షవర్ధన్ ప్రాణాంతకమైన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ - మెనింజైటిస్‌తో బాధపడుతున్నాడు. ఒక మూడు వారాల క్రితం మా అబ్బాయి ఇలా ఐసీయూలో ప్రాణాలతో పోరాడాల్సి వస్తుందని చెప్తే నేను అసలు నమ్మేదాన్నే కాదు. తనకు వచ్చిన అనారోగ్యం మాకు ఒక షాక్..... ఇదీ హర్ష తల్లి ఆవేదన.


పదేళ్లే అయినా కొత్త విషయాలు నేర్చుకోవడానికి హర్షవర్ధన్ చాలా ఆసక్తి చూపేవాడు. ప్రతిరోజూ ఉత్సాహంగా గడిపేవాడు. తను ఆడుకుంటూ నా దగ్గర్లో ఉంటే చాలు.. నా మొహంపై నవ్వు చెరిగేది కాదు. ‘‘అమ్మా నేను పెద్దయ్యాక ఇంజినీర్ అవుతా’’ అంటూ గొప్పగా చెప్పేవాడు నా బిడ్డ. చిన్న పిల్లాడే అయినా ఎప్పుడూ చదువును అశ్రద్ధ చేయలేదు. అంతా బాగానే ఉందని అనుకుంటుండగా మే నెలలో ఉన్నట్టుండి మా బాబుకు జలుబు చేసింది. ఆ తర్వాత బాగా జ్వరం వచ్చింది. టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రతిరోజూ తన పక్కనే ఆస్పత్రిలో ఉండి బాగోగులు చూసుకునేదాన్ని. వారం గడిచిన తర్వాత కూడా హర్షవర్ధన్ ఆరోగ్యం కుదుటపడలేదు. అక్కడి నుంచి పరిస్థితి మరింత దిగజారిందే తప్ప బాగుపడలేదు.


హర్షవర్ధన్‌కు ఉదార హృదయంతో సాయం చెయ్యండి.... ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి


డాక్టర్లు ఇచ్చిన ఏ మందూ పనిచేయలేదు. ఆ తర్వాత తనకు మెడ, తల బాగా నొప్పిగా ఉందని హర్ష చెప్పాడు. అతని చెవిలో నుంచి ఏదో ద్రవం కారడంతో నాకు వణుకు పుట్టింది. వెంటనే బిడ్డను తీసుకొని సిటీలోని ఆస్పత్రికి వెళ్లాం. అక్కడకు వెళ్లాక హర్షను చూసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు. అసలు సమస్యేంటో కూడా మాకు తెలియలేదు. నిమిషాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చిన డాక్టర్లు.. ‘‘మీ అబ్బాయికి ప్రాణాంతకమైన మెదడు ఇన్‌ఫెక్షన్ ఉంది. అతను ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు’’ అని చెప్పారు. అంతే నా కళ్ల ముందున్న ప్రపంచం మొత్తం గింగిరాలు తిరిగుతున్నట్లు అనిపించింది.హర్ష సైనసెస్‌లో పలుచోట్ల ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది. రోజురోజుకూ హర్ష శక్తి సన్నగిల్లుతోంది. నిన్నమొన్నటి వరకూ ఆడుతూ పాడుతూ తిరిగిన నా పిల్లాడు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడంటే నేనసలు నమ్మలేకపోతున్నా. అప్పటి నుంచి హర్షకు ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. తనకు ఇంకా అత్యవసర వైద్యసేవలు అవసరం. అందుకే అబ్బాయిని ఐసీసీయూలోకి మార్చారు. ఈ వైద్య సేవల కోసం రూ. 30,35,000 (40688.82 డాలర్లు) ఖర్చవుతుంది.


హర్షవర్ధన్‌కు ఉదార హృదయంతో సాయం చెయ్యండి.... ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి


నా బిడ్డ నిరంతరం నొప్పితో బాధపడుతున్నాడు. అతని శరీరం నిండా సూదులు, ట్యూబులే. కళ్లు తెరవాలన్నా, కనీసం చిన్న శబ్దం చేయాలన్నా హర్ష వల్ల కావడం లేదు. తన పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. నా భర్త ఒక రోజుకూలీ. పిల్లాడి చికిత్సకు కావలసిన సొమ్మును మేం సమకూర్చడం అసంభవం. అందుకే నేను ఇలా అందర్నీ అభ్యర్థిస్తున్నాను. మీ దయే నా బిడ్డకు ఉన్న ఏకైక అవకాశం. దయచేసి నా బిడ్డను బ్రతికించుకోవడానికి సహాయం చేయండి.