కదంతొక్కిన అన్నదాతలు

ABN , First Publish Date - 2021-01-27T05:28:14+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన రైతుల దీక్షకు మద్దతుగా జిల్లా రైతులు కదంతొక్కారు. రైతు సంఘాల అధ్వర్యంలో అన్ని మండలాల నుంచి ట్రాక్టర్లతో మంగళవారం ఉదయం విజయనగరం చేరుకుని.. భారీ ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ నుంచి గురజాడ అప్పారావు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు

కదంతొక్కిన అన్నదాతలు
ట్రాక్టర్లతో ర్యాలీ చేస్తున్న అన్నదాతలు

ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

కలెక్టరేట్‌, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన రైతుల దీక్షకు మద్దతుగా జిల్లా రైతులు కదంతొక్కారు.  రైతు సంఘాల అధ్వర్యంలో అన్ని మండలాల నుంచి ట్రాక్టర్లతో మంగళవారం ఉదయం విజయనగరం చేరుకుని.. భారీ ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ నుంచి గురజాడ అప్పారావు విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు ముర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ తమ పోరాటం సాగుతుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా 520 రైతు సంఘాలు పోరాటం చేస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలోని సీఐటీయూ నాయకులు టీవీ రమణ, అప్పలసూరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:28:14+05:30 IST