కదంతొక్కిన మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2021-06-15T06:19:58+05:30 IST

సమస్యలు పరిష్కరించాలంటూ ము న్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు సోమవారం కదంతొక్కారు.

కదంతొక్కిన మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు
రాయదుర్గంలో కార్మికుల నిరసన ర్యాలీ

రాయదుర్గం టౌన, జూన 14 : సమస్యలు పరిష్కరించాలంటూ ము న్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులు సోమవారం కదంతొక్కారు. రా యదుర్గం పురపాలక సంఘం కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. అం తకుముందు మొలకాల్మూరు రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎ దుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయూ నా యకులు మల్లికార్జున మాట్లాడుతూ కరోనా విపత్తులో కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించారన్నారు. అయినా ప్రభుత్వం పా రిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారంలో తాత్సారం చేస్తోందన్నారు. ఆ ప్కాస్‌ విధానాన్ని రద్దు చేసి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో నాయకులు తిప్పేస్వామి, మల్లేష్‌, రాము, బ సవరాజు, వన్నూరుస్వామి, ఆదిలక్ష్మీ, వన్నూరమ్మ, కార్మికులు పాల్గొన్నారు. 


గుత్తి: మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పారిశుధ్య కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యం లో సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో పని చేస్తున్న 81 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేసి, పెండింగ్‌ హెల్త్‌ అలవెన్సు మంజూరు చేయాలన్నారు. ఈఎ్‌సఐ, ఈ ఫీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన వ న్నూరూబీ వినతిపత్రాన్ని అందజేశారు. నిరసనలో నాయకులుు నాగేంద్ర, మహేష్‌, రాము, కార్మికులు పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను వెంట నే రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీ శ్రీనివాసు లు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీ యూ ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు సమ్మె చేపట్టారు. పారిశుధ్య కా ర్మికులను సచివాలయ బదిలింపులకు ఆపాలన్నారు. నిరసనలో నాయకు లు దాసరి  శ్రీనివాసులు, క్రిష్టప్ప, మారుతీప్రసాద్‌, కార్మికులు కృష్ణ, జగదీష్‌, హనుమంతు, బాలయ్య, లక్ష్మిదేవి, పద్మావతి, సరస్వతి పాల్గొన్నారు.


పామిడి: ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల కు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు నాగేంద్ర పేర్కొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి మున్సిపల్‌ కా ర్మికులు అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కా ర్యాలయం ముందు నిరసన చేపట్టారు. నిరసనలో నాయకులు ఎర్రప్ప, కా ర్మికులు ప్రసాదు, నారాయణ, సంజప్ప, పెద్ద నరసింహులు, మురళీ, సు బ్బన్న, బాలనాగమ్మ, నరసమ్మ, మంగమ్మ, ముత్యాలక్క పాల్గొన్నారు.


Updated Date - 2021-06-15T06:19:58+05:30 IST