Abn logo
Sep 20 2021 @ 23:59PM

సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌

- శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

ఆమదాలవలస : సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తామని శ్రీకాకుళం  పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ తెలిపారు. సోమవారం ఆమదాలవలసలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను కమిషన్‌ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రస్తుత ఫలితాలు పరిశీలిస్తే తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధికి ప్రజలు ఆదరణ చూపారన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపు మేరకు నాయకులు దూరంగా ఉన్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నాయకులు నామినేషన్లు వేయడంతో పోటీకి తగ్గేదిలేదని తెలిపారు. బరిలో నిలిచి ప్రజదరణ పొందిన వార్ని అభినందించారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి 14 వేలు మెజార్టీ వస్తే, ఈ ఎన్నికల్లో మెజార్టీ ఐదు వేలుకు పడిపోయిందని తెలిపారు. వైసీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిది వేల ఓట్లు తేడా వచ్చిందంటే ప్రభుత్వపాలనకు రిఫరెండం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీటీసీ అభ్యర్థి సనపల ఢిల్లీశ్వరరావు, నాయకులు నూకరాజు బండి, ప్రభావతి, రామశంకర్‌ పాల్గొన్నారు.


టీడీపీకి ప్రజల్లో ఆదరణ

పొందూరు : టీడీపీపై పజల్లో ఆదరణ పెరిగిందనడానికి పరిషత్‌ ఎన్నికల ఫలి తాలే నిదర్శనమని మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. సోమవారం పొందూరు లో పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను ఆమె కలిసి మాట్లాడారు. అధికార వైసీపీ బెదిరింపులు, ప్రలోబాలకు గురిచేసినా మండలంలో తొమ్మిది స్థానాల్లో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు శంకర్‌భాస్కర్‌,  గాడు నారాయణరావు, బాడాన గిరి, బాడాన హారిక ఉన్నారు.