గ్రీన్‌ టీలో కొవిడ్‌తో పోరాడే లక్షణాలు!

ABN , First Publish Date - 2021-06-06T05:30:00+05:30 IST

ఆరోగ్యకర జీవన విధానానికి గ్రీన్‌ టీ ఎంతో దోహదపడుతుంది. అధిక బరువు తదితర సమస్యలకు ఇది

గ్రీన్‌ టీలో కొవిడ్‌తో పోరాడే లక్షణాలు!

ఆరోగ్యకర జీవన విధానానికి గ్రీన్‌ టీ ఎంతో దోహదపడుతుంది. అధిక బరువు తదితర సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాదు... గ్రీన్‌ టీ కొవిడ్‌-19తో కూడా పోరాడగలదని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గ్రీన్‌ టీలో ఉండే ‘గలోకాటెచిన్‌’ అనే సమ్మేళనాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు... అది సార్స్‌-కోవ్‌-2ను ఎదుర్కోగల ఔషధ అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోని ‘స్వాన్సియా యూనివర్సిటీ’ జరిపిన ఈ అధ్యయనం ‘ఆర్‌ఎస్‌సీ అడ్వాన్సెస్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది.


అయితే దీనిపై మరింత విస్తృత పరిశోధన చేయాల్సి ఉందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురేశ్‌ మోహన్‌కుమార్‌ వెల్లడించారు. ‘స్వాన్సియా యూనివర్సిటీకి’ వెళ్లకముందు ఆయన ఊటీలోని ‘జేఎస్‌ఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీ’లో విధులు నిర్వర్తించారు. ‘‘ప్రస్తుతం ఈ పరిశోధన ఆరంభ దశలోనే ఉంది. కానీ కొవిడ్‌తో పోరాడగలిగే గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది మా పరిశోధనను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రోత్సాహాన్నిస్తుంది’’ అని సురేశ్‌ తెలిపారు. 


Updated Date - 2021-06-06T05:30:00+05:30 IST