Abn logo
Sep 22 2021 @ 23:19PM

ప్రజా సమస్యలపై పోరాటం

రామకృష్ణాపూర్‌లో మాట్లాడుతున్న టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు

- టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు

మందమర్రి, సెప్టెంబరు 22: పేదలకు అండగా ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు  బుధవారం రామకృష్ణాపూర్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసింహులు హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా ఎటు వంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్థానిక సమస్యలు, మొదలైనవాటిపై పోరాడేందుకు కార్యకర్తలు ఏ విధంగా ముందుకు రావాలి, నియోజకవర్గాల వారీగా పార్లమెంటు పరిధిలో ముఖ్యనేతలతో చర్చించారు. అదేవిధంగా ఈ ప్రాంత సింగరేణి, నిరుద్యోగ యువత, రైతుల భవిష్యత్తు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అరిక ట్టడం తదితర మఖ్యాంశాలపై చర్చించారు.  సమావేశంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు జోష్ణదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరిఫ్‌ ఖాన్‌, నాయకులు కృష్ణమాచారీ, బొంగర్‌, అమనుల్లాఖాన్‌, ఏడుకొండలు, వినాయక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 - హామీలు ఇచ్చి మరిచిపోవడం అలవాటే 

మందమర్రిటౌన్‌: ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం టీఆర్‌ఎస్‌ పార్టీకి అలవాటని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. బుధవారం మందమర్రిలో ఆ యన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల కోసమే పుట్టిన పార్టీ టీడీపీ అని చెప్పారు. ఆ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల జరుగుతున్న పరిణా మాలను ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు వల్ల ఒరిగేది లేదని, దళితులు ఆర్థింగా ఎదిగేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్గా ప్రజలు సోదర భావంతోనే ఉంటున్నారని చెప్పారు. టీడీపీ ఫలాలు ఇచ్చే చెట్టు లాంటిద న్నారు. ఫలాలు ఇచ్చే పార్టీని కాదని పనికిరాని చెట్లను ప్రజలు పెంచుతు న్నారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌, టీడీపీ ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి ఆనంద్‌, తెలుగు యువత అధ్యక్షుడు వాసాల సాగర్‌, స్థానిక నాయ కులు జక్కుల సమ్మయ్య, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.