13 ఏళ్ల క్రితం Dubai కి వెళ్లిన ఆ ఇంజనీర్ జీవితం ఒక్క రోజులోనే అనూహ్య మలుపు.. రాత్రికి రాత్రే జేబులోకి రూ.66 లక్షలు

ABN , First Publish Date - 2021-09-18T20:21:03+05:30 IST

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం.

13 ఏళ్ల క్రితం Dubai కి వెళ్లిన ఆ ఇంజనీర్ జీవితం ఒక్క రోజులోనే అనూహ్య మలుపు.. రాత్రికి రాత్రే జేబులోకి రూ.66 లక్షలు

దుబాయ్: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్నటి వరకు రోజువారీ అవసరాలకు కూడా ఇబ్బంది పడినవారు అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారచ్చు. ఇదిగో దుబాయ్‌లో ఉండే ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ ఇంజనీర్ విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. 13 ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న అతని జీవితం ఒక్క రోజులోనే అనూహ్య మలుపు తిరిగింది. రాత్రికి రాత్రే జేబులోకి రూ.66 లక్షలు వచ్చి చేరాయి. ఇదంతా ఆయనకు లాటరీలో తగిలిన జాక్‌పాట్ వల్లే సాధ్యమైంది. మహజూజ్ వీక్లీ డ్రాలో ఆయన ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు. మరో ఇద్దరితో కలిసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్ తగిలాయి. దాంతో ముగ్గురు చెరో 3,33,333 దిర్హమ్స్(రూ.66 లక్షలు) పంచుకున్నారు. 


ఇవి కూడా చదవండి..

Kuwait లో ఎడమ చేతితో తినకూడదా..? ఆ దేశంలో ఉండగా ఏమేం చేయకూడదంటే..

ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్‌కు చెందిన జావేద్(పేరు మార్చాం) గత 13 ఏళ్లుగా భార్య, 11 ఏళ్ల కుమారుడితో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు.  ఈ క్రమంలో కొన్నేళ్లుగా మహజూజ్ లాటరీలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. లాటరీ తగలకున్న నిరాశ చెందకుండా ఈ త్రయం తరచూ టికెట్లు కొనుగోలు చేసి తమ అదృష్టం పరీక్షించుకునేది. ఇటీవల తన తల్లి చెప్పిన సూచనలతో ఓ ప్రత్యేక కాంబినేషన్‌తో జావేద్‌ తన ఇద్దరు మిత్రులతో కలిసి ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అదే అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ లాటరీ టికెట్‌కు ఏకంగా 1 మిలియన్ దిర్హమ్స్ తగిలాయి. దాంతో ముగ్గురు చెరో 3,33,333 దిర్హమ్స్(రూ.66 లక్షలు) పంచుకున్నారు. రాత్రికి రాత్రే ఇంత భారీ మొత్తం గెలుచుకున్న జావేద్ ఆనందానికి అవధుల్లేవు. భార్య, కుమారుడితో కలిసి ఆయన వీక్లీ డ్రా కార్యక్రమం కోసం వెళ్లాడు. ఆ సమయంలో తాము కొన్న లాటరీ టికెట్ నెంబర్‌కు జాక్‌పాట్ తగలడం చూసి కొద్దిసేపు అసలు నమ్మలేకపోయానని జవేద్ తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని తన మిత్రులకు ఈ విషయం తెలియజేసినట్లు చెప్పాడు.  


ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన కుమారుడి చదువుకు వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే మరో కొంత మొత్తాన్ని సొంతంగా ఓ బిజినెస్ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపాడు. దాని ద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించాలనేది తన ఆలోచనగా జావేద్ పేర్కొన్నాడు. కాగా, మహజూజ్‌ లాటరీ డ్రాలో గడిచిన 4 నెలల్లోనే ఫిలిప్పీన్స్ నుంచి ఏకంగా 12 మంది విజేతలుగా నిలిచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 



Updated Date - 2021-09-18T20:21:03+05:30 IST