ప్రజల్లో మనోధైర్యం నింపండి: ఎమ్మెల్యే ద్వారక

ABN , First Publish Date - 2021-05-17T05:58:04+05:30 IST

కరోనా రెండో దశవిజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు.

ప్రజల్లో మనోధైర్యం నింపండి: ఎమ్మెల్యే ద్వారక
తంబళ్లపల్లెలో వైద్యులు, రెవెన్యూ, పోలీసులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే

పెద్దమండ్యం/ తంబళ్లపల్లె, మే 16 కరోనా రెండో దశవిజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. పెద్దమండ్యం మండల కార్యాలయాల సముదాయంలో కరోనా నివారణపై సర్పంచులు, అధికారులతో ఆయన సమీక్షించారు. పరిస్థితులను బట్టి పెద్దమండ్యంలో కూడా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లించాలని, హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని సంబంధిత అధికారులను కోరారు. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రమేష్‌ పూర్ణచంద్రిక, వైసీపీ బీసీసెల్‌ కార్యదర్శి రమేష్‌, సర్పంచులు విశ్వనాధ, బాబా, విశ్వనాధ, నాయకులు షబ్బీర్‌, రామిరెడ్డి, కేశవ, ఎంపీడీవో శ్రీధర్‌రావు, ఎస్‌ఐ వెంకటశికుమార్‌, పీఆర్‌ఎస్‌ఈ నాగేంద్ర వరప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.  కొవిడ్‌ బాధ పడుతున్నవారికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కోరారు. ఆదివారం ఆయన తంబళ్లపల్లె పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో 120 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలించారు. కేంద్రంలో ఉన్న బాధితులతో వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య, రెవెన్యూ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేసి కొవిడ్‌ బాధితులకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఇక రాజంపేట ఎమ్మెల్యే మిథున్‌రెడ్డి తన సొంత నిధులతో 10 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను వితరణ చేసినట్టు తంబళ్లపల్లె సీహెచ్‌సీ వైద్యాధికారి సరస్వతమ్మ తెలిపారు. ఆదివారం పరికరాలను సీహెచ్‌సీకి చేర్చినట్టు పేర్కొన్నారు.



Updated Date - 2021-05-17T05:58:04+05:30 IST