విద్యా పరిశోధన సంస్థలో ఖాళీల భర్తీకి చర్యలు

ABN , First Publish Date - 2021-04-21T09:57:07+05:30 IST

రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న అకడమిక్‌, పారా అకడమిక్‌ పోస్టులను ఫారిన్‌ సర్వీసు నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

విద్యా పరిశోధన సంస్థలో ఖాళీల భర్తీకి చర్యలు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న అకడమిక్‌, పారా అకడమిక్‌ పోస్టులను ఫారిన్‌ సర్వీసు నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీటికి అర్హత కలిగిన లెక్చరర్లు, సీనియర్‌ లెక్చరర్లు, హెడ్‌ మాస్టర్స్‌, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తులు, అర్హత ధ్రువీకరణ పత్రాలను ఆర్‌జేడీఎ్‌సఈ, డీఈవో, ప్రిన్సిపల్‌-డైట్స్‌ కార్యాలయాల్లో ఈనెల 29 లోపు సమర్పించాలని సూచించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు జారీ చేసినట్లు పేర్కొంది.

Updated Date - 2021-04-21T09:57:07+05:30 IST