Jun 11 2021 @ 22:08PM

ఇల్లీబేబీ అందాలు.. అమితాబ్‌ జ్ఞాపకాలు!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌! 


బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ గతంలో ఓ అభిమానికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన దృశ్యాన్ని షేర్‌ చేశారు. అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. మరికొందరు తారలు తమ గురించి ఆసక్తికర విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 


1. నిర్మాత బన్నీ వాసుకి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్‌. నా బెస్ట్‌ సపోర్ట్‌ అని రాసుకొచ్చారు. 


2. ఎలాంటి క్యాప్షన్‌ లేకుండా ఈ ఫొటో అప్‌లోడ్‌ అయిందంటూ ఓ ఫొటో పంచుకున్నారు సుధీర్‌బాబు. 


3. వర్క్‌ని చాలా మిస్‌ అవుతున్నానంటూ గద్దలకొండ గణేష్‌ చిత్రంలో ఓ లుక్‌ షేర్‌ చేశారు వరుణ్‌ తేజ్‌.


4. మ్యూజిక్‌ మోడ్‌లో ఉన్నానని చెబుతున్నారు రాయ్‌లక్ష్మీ.


5. రాజస్థాన్‌లో రెండు రోజులపాటు ‘పానీ పానీ’ సాంగ్‌ షూట్‌ చేశామని జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌. 


6. మేకప్‌ లేకుండా అంటూ ఓ గ్లామ్‌ ఫొటో షేర్‌ చేశారు ప్రియాంకా జవాల్కర్‌. 


7. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహారం, నిత్యావసరాలు కావలసినవారు దయ చేసి మీ పేరుతో ఇన్‌బాక్స్‌లో మెసేజ్‌ పంపండి అని కోరారు రేణు దేశాయి. 

 


























ఆంధ్రప్రదేశ్ మరిన్ని...