Jun 14 2021 @ 22:13PM

రజనీతో మెమరీస్‌... వ్యాక్సిన్‌ డ్రైవ్‌!


సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

రజనీకాంత్‌ హీరోగా, ఆయనకు కూతురుగా నివేదా థామస్‌ నటించిన చిత్రం ‘దర్బార్‌’. ఆ సినిమా జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అందులో ఓ పాటకు సంబంధించిన స్టిల్‌ను ఆమె అభిమానులతో పంచుకున్నారు. 


1. ఈ నెల 14న రామ్‌చరణ్‌, ఉపాసనల పెళ్లి రోజు సందర్భంగా ఇద్దరూ దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసి ఆనందం వ్యక్తం చేశారు ఉపాసన. 


2. నితిన్‌ నటించిన ‘జయం’ సినిమా సోమవారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజకి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నితిన్‌. 


3. సత్యదేవ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘తిమ్మరుసు’ చిత్రంలోని స్టిల్స్‌ని పంచుకున్నారు  బ్రహ్మాజీ. త్వరలోనే వస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. 


4. తన కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉందని అడుగుతున్నారు త్రిష 


5. నా షూస్‌ని మీరు ఇష్టపడుతున్నారా?’’ అని అడుగుతోంది నటి మాళవిక మోహనన్‌. 


6. ‘బ్యాక్‌ టు షూటింగ్‌’ అని ఓ ఫొటో పోస్ట్‌ చేశారు నిఖిల్‌. 


7. మండే మూడ్స్‌ అంటూ డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫొటో సెట్‌ షేర్‌ చేశారు అమైరా  దస్తర్‌. 


8. ‘నా లవ్‌ని చాలా మిస్‌ అవుతున్నాను’ అంటూ నిక్‌ జోనస్‌ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఫొటో పంచుకున్నారు. 


9. రష్మికతో ఉన్న జ్ఞాపకాలను ఫొటో రూపంలో పోస్ట్‌ చేశారు ఛార్మి. 


10. ఇటీవల తల్లైన సింగర్‌ శ్రేయాఘోషాల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అలాగే మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఫొటో షేర్‌ చేశారు.