Jun 17 2021 @ 22:48PM

అందమైన భామలు.. ఫిట్నెస్ మంత్రాలు!

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! 

అందాల తారలు తాప్సీ, లావణ్యా త్రిపాఠీ, కేథరిన్‌, సురభి, కృతి కర్భందా కొత్తకొత్త ఫొటోలతో సోషల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేశారు. ఆ విషయాలపై ఓ లుక్కేయండి! 


1. మాస్కో ట్రిప్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు తాప్సీ. 


2. నివేదా థామస్‌ మొదటి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మీరు కూడా తప్పకుండా తీసుకోండి అని అభిమానుల్ని కోరారు. 


3. మనం పర్వతం ఎక్కడం ప్రారంభించి దానిని కొనసాగిస్తే ప్రతి కొండ మనకు అందుబాటులోనే ఉంటుంది అంటున్నారు లావణ్యా త్రిపాఠీ. 


4. ఆరు బయట కూర్చొని సూర్యరశ్మిని ఆస్వాదించిన ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు రాశీ ఖన్నా.


5. ఓ షోలో చేసిన డ్యాన్సు వీడియోతో సందడి చేశారు నటి పూర్ణ. 


6. నాలుగు రోజుల్లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫిట్‌నెస్‌ కోసం మీరు ఏం చేస్తున్నారు? అని అడుగుతున్నారు. ఆమె చేసిన వర్కవుట్‌ వీడియోలు చేశారు మలైకా అరోరా.


7. మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి అంటే ఓ పోస్ట్‌ చేశారు పొడుగు కాళ్ల సుందరి హంసా నందిని. 


8. ప్రకృతి ఇంత అందంగా ఎలా ఉంటుంది అంటూ ఓ బ్యూటిఫుల్‌ ఫొటోతో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు పరిణీతి చోప్రా. 


9. చిన్నతనంలో తను పోషించిన గంగ పాత్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అప్పటి ఫొటోను షేర్‌ చేశారు అప్సరా రాణి. 


10. ‘మహర్షి సెట్‌లో సరదాగా’ అంటూ షూటింగ్‌ టైమ్‌లో తీసిన ఫొటో షేర్‌ చేశారు పూజా హెగ్డే. 


11. గతంలో తన మేనకోడలితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్నారు నమ్రతా శిరోద్కర్‌. 


12. ‘తెల్లవారితే గురువారం’ సినిమాకి సంబంధించిన ఫొటో షూట్‌ని పంచుకున్నారు ఈ చిత్ర కథానాయిక చిత్ర శుక్ల.