Abn logo
Jul 8 2020 @ 02:57AM

చిత్ర పరిశ్రమకు త్వరలో తీపి కబురు

కేంద్ర ప్రభుత్వం నుంచి చిత్ర పరిశ్రమకు త్వరలో తీపి కబురు అందనుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్‌లను పునఃప్రారంభించుకునేందుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ముంబైలో నిర్వహించిన ‘ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీ’ (ఫిక్కీ) 21వ వార్షిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జవడేకర్‌ మాట్లాడుతూ ‘‘సృజనాత్మక రంగంలో భారత్‌ దూసుకుపోతోంది. ఇక్కడ చిత్రీకరించిన సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో వీక్షిస్తున్నారు. ఈ రంగంలో వ్యాపారవేత్తలు మరిన్ని పెట్టుబడులు పెట్టి చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకుపోవాలి. నూతన మార్గదర్శకాల వల్ల సీరియల్‌, రియాలిటీ షోస్‌, కో ప్రొడక్షన్‌, గేమింగ్‌, యానిమేషన్‌ తదితర రంగాల్లో పని చేేస పలువురికి లబ్థి చేకూరనుంది’’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement