Abn logo
Jul 13 2020 @ 23:46PM

‘న్యూ’స్‌

కాల్‌షీట్స్‌ సమస్య వల్ల అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ నుంచి తప్పుకున్నట్టు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి వెల్లడించారు. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక, సినిమా యూనిట్‌ను ఇబ్బందిపెట్టడం ఎందుకని ముందుగా తప్పుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.


విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్‌’ చిత్రానికి కరణ్‌ జోహార్‌ సలహా మేరకు హిందీ సంగీత దర్శకుల నుంచి బాణీలు తీసుకుంటున్నట్టు భోగట్టా. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడి నుంచి తీసుకోవడం బాలీవుడ్‌ స్టైల్‌. ‘సాహో’కి అలాగే చేశారు.


సంగీత దర్శకుడు కీరవాణి చిన్నకుమారుడు శ్రీ సింహా హీరోగా, హాస్యనటుడు సత్య, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్‌ రాణా దర్శకుడిగా పరిచయమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో చెర్రీ, హేమలత నిర్మించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. అక్కడ కూడా రితేశ్‌ దర్శకత్వం వహిస్తారనీ, డైలాగ్‌ వెర్షన్‌ సహా స్ర్కిప్ట్‌ సిద్ధం చేశారని సమాచారం.


మలయాళంలో విజయం సాధించిన ‘లూసిఫర్‌’ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రీమేక్‌ చేయనున్న సంగతి విదితమే. రామ్‌చరణ్‌ నిర్మించే ఈ చిత్రానికి ‘సాహో’ దర్శకుడు సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ వెర్షన్‌లో వివేక్‌ ఓబరాయ్‌ విలన్‌గా నటించారు. తెలుగులో కూడా ఆయన్ని అదే పాత్ర పోషించమని అడిగినట్లు సమాచారం. అయితే ఒకే పాత్రను రెండు సార్లు పోషించడం ఇష్టం లేక వివేక్‌ ఓబరాయ్‌ ‘నో’ చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు అదే పాత్రను రెహమాన్‌ పోషించనున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌.


Advertisement
Advertisement
Advertisement