Abn logo
Jun 4 2020 @ 12:55PM

మరో పెద్ద దిక్కును కోల్పోయిన బాలీవుడ్

ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బసు చటర్జీ కన్నుమూశారు. 93 ఏళ్ల బసు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఎక్ రుకాహువా ఫైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన సినిమాలు తీశారు. బసు సినిమాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని పేరుంది. అమితాబ్ బచ్చన్‌తో మంజిల్, రాజేశ్ ఖన్నా‌తో చక్రవ్యూహ్, దేవానంద్‌తో మన్ పసంద్ సినిమాలు తీశారు. ఇవి సూపర్‌హిట్ అయ్యాయి. గతంలో ఆయన టీవీ సీరియళ్లు కూడా రాశారు. 1992లో ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 


ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటంటూ పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముంబై శాంతాక్రాజ్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 

Advertisement
Advertisement
Advertisement