Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పులపై ఆర్థికమంత్రి పిట్టకథలు మానాలి: యనమల

విజయవాడ: అప్పులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పిట్టకథలు మానాలని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు హితవుపలికారు. 60 నెలల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్ల అప్పు చేసి.. అనేక అభివృద్ధి పనులు చేసిందని గుర్తుచేశారు. 20 నెలల్లో సీఎం జగన్‌ రూ.1.55 లక్షల కోట్లు అప్పుచేసి ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ సంక్షేమం.. మోసకారి సంక్షేమమేనని నేత యనమల తప్పుబట్టారు. 20 నెలల్లో తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, ధరలతో.. ఒక్కో కుటుంబంపై రూ.2.5 లక్షల భారం పడిందని యనమల రామకృష్ణుడు తెలిపారు.


Advertisement
Advertisement