Abn logo
Sep 20 2021 @ 23:57PM

జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం

శ్రీను కుటుంబ సభ్యులకు చెక్కు అందజేస్తున్న నాదేండ్ల మనోహర్‌

ఇచ్ఛాపురం : రోడ్డు ప్రమాదంలో ఇటీవల  మృతి చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ అం డగా నిలిచింది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యుల కు   ఐదులక్షల చెక్కును జనసేన రాజకీయ వ్యవ హారాల కమిటీ చైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌ అందజేశారు. సోమవారం రాత్రి ఇచ్చాపురం వచ్చిన మనోహర్‌ను జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బెల్లుపడకు  చెందిన నీలాపు శ్రీను కుటుంబాన్ని పరామర్శించి చెక్‌ను అందించారు. పాతబస్టాండ్‌ జంక్షన్‌ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విమర్శించారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు,  రాష్ట్ర కార్యదర్శి తిప్పన దుర్యోధనరెడ్డి, దాసరి శేఖర్‌ పాల్గొన్నారు.