ఉద్దీపన ప్యాకేజీ ఏ మాత్రం చాలదు

ABN , First Publish Date - 2020-09-30T07:00:05+05:30 IST

కొవిడ్‌-19 కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక కష్టాల నుంచి బయ ట పడేందుకు ఈ ప్యాకేజీ ఏ మాత్రం చాలదన్నారు...

ఉద్దీపన ప్యాకేజీ ఏ మాత్రం చాలదు

  • అభిజిత్‌ బెనర్జీ


న్యూఢిల్లీ : కొవిడ్‌-19 కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక కష్టాల నుంచి బయ ట పడేందుకు ఈ ప్యాకేజీ ఏ మాత్రం చాలదన్నారు. ‘ఇది దివాలా తీసిన బ్యాంకును ఆదుకోవడం లాంటిది. దీని ప్రభా వం పరిమితంగానే ఉంటుంది. ఈ ప్యాకేజీ మరింత ఎక్కువగా ఉండాల్సింది’ అన్నారు. అల్పాదాయ వర్గాల చేతుల్లో మరిన్ని నిధులు ఉంటే తప్ప, వారి వినియోగ ఖర్చులు పెరిగే అవకాశం లేదన్నారు. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నట్టు లేదన్నారు. ప్రస్తుతం మిగతా దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు అత్యంత పేలవంగా ఉందన్నారు. సెప్టెంబరు త్రైమాసికం నుంచి జీడీపీ వృద్ధి రేటు కొద్దిగా గాడిలో పడే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2020-09-30T07:00:05+05:30 IST